చిన్న వ‌య‌స్సులోనే ప్రేమ‌లో ప‌డి ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు పెద్దలు.. ప్రేమ ఏ వయసులో ? ఎవరికి ఎలా పడుతుందో ఎవరు చెప్పలేం ? అలాంటిది చిత్ర పరిశ్రమలో ఉన్నసెలబ్రిటీలకు కుల, మత, జాతి, అనే వర్గ భేదాలు లేకుండా వారి మనసుకు నచ్చిన వారితో ప్రేమాయణాలు నడుపుతూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు.. మరికొందరైతే మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటారు.

ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్లుగా ఉన్న కొందరు.. టీనేజ్ లోనే ప్రేమలో పడి అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా తమ మనసు చిన్న వయసులోనే చేజారి పోయిందంటూ చెప్పుకుంటారు.. ఈ లిస్టులో ఏ ఏ హీరోయిన్లు ఉన్నారో ఒకసారి చూద్దాం.

శృతిహాసన్ :
లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన 15 ఏళ్ల వయసులోనే ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించిందట.. చిన్నతనంలోనే ఆ అబ్బాయిపై ప్రేమ కలిగిందని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక సిద్ధార్థ్‌, ధనుష్, మైఖేల్ కోర్సులే వంటి పలువురు హీరోల‌తో ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వాళ్ళందరికీ బ్రేకప్ చెప్పి ముంబాయికి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికతో సహజీవ‌నం చేస్తుంది.

కియారా అద్వానీ :
బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో కియారా అద్వానీ కూడా ఒకరు.. ఈమె తెలుగులో మహేష్ కు జంటగా భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామలో కూడా నటించింది. ప్రస్తుతం శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్‌లో కూడా హీరోయిన్‌. కియారా కూడా ఇంటర్ చదివే రోజుల్లోనే తన క్లాస్మేట్‌ను ప్రేమించిందట. ఇంట్లో ఈ విషయం తెలిసిపోవడంతో ఈమెను కట్టడి చేశారట.. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది.

అనసూయ:
టాలీవుడ్ హాట్ యాంక‌ర్‌ అనసూయ కూడా తన చిన్నతనంలోనే ప్రేమలో పడింది. తను చదువుకునే రోజుల్లో ఎన్సిసీ క్యాంపులో శశాంక్ భరద్వాజ్‌నే వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంవత్సరాలు తరబడి వారి ప్రేమను కొనసాగించి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఇలా చిన్నతనంలోనే ప్రేమలో పడిన వారిలో వీరే కాకుండా నిధి అగర్వాల్, తాప్సీ లాంటి ఎందరో హీరోయిన్లు కూడా ఉన్నారు.