సాధారణంగా చిరంజీవి సినిమాలను చూసినట్టయితే ఆయన పెద్దగా వివాదాస్పదం అనేటటువంటి మాటకు దూరంగా ఉంటారు. ఎందుకంటే చిరంజీవి చాలా కట్టుబాట్లతో పెరిగారు. అలానే ఉన్నత శిఖరా లను అధిరోహించడానికి ఆయనకు ఉన్న క్రమశిక్షణ, నిబద్ధతులు కారణమని ఆయన మామగారు అల్లు రామలింగయ్య అనేక సందర్భాల్లో చెప్పేవారు. చిరంజీవిని చూసినప్పుడు పోకిరి అని తాను అనుకున్నా నని కానీ చిరంజీవిలో చాలా సబ్జెక్ట్, దూరదృష్టం ఉందని అనేక సందర్భాల్లో అల్లూ రామలింగయ్య చెప్పుకొచ్చారు.
చిరంజీవి అంత నిబద్ధత వ్యవహరించినా.. నిజానికి చెప్పాలంటే ఆ రోజుల్లో సినిమా రంగంలో ఉన్నటువంటి వారు హీరో హీరోయిన్లను ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది మనకు తెలిసిందే. శ్రీకాంత్ ఊహ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ జీవిత వివాహం ప్రేమించుకునే జరిగింది. అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి సినిమా రంగంలో చిరంజీవి మాత్రం చాలా కట్టుబాటులతో వ్యవహరించారు. మరి అంత కట్టుబాటులతో వ్యవహరించిన చిరంజీవి కూడా మనసు చలించిన సందర్భం ఉందంటేఆశ్చర్యం వేస్తుంది.
వాస్తవానికి చిరంజీవి మీద అనేక గ్యాసిప్‌లు వచ్చాయి. రాధా రాధిక భానుప్రియ ఇలాంటి వారెందరితోనూ కూడా ఆయన స్నేహం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి చిరంజీవి ఎటువంటి వివాదాస్పదం కాకుండా చాలా జాగ్రత్తగా కెరియర్ను నడిపించారు. అటువంటి చిరంజీవి ఒక సందర్భంలో మనసు కదిలిపోయేలా వ్యవహరించాలని కళా తపస్వి కే. విశ్వనాధ్ ఓ సందర్భంలో చెప్పారు. చిరంజీవి నటించినటువంటి సినిమాల్లో కే విశ్వనాథ రెండు సినిమాలు చేశారు.
ఒకటి స్వయంకృషి రెండోది ఆపద్బాంధవుడు. స్వయంకృషి సినిమాలో విజయశాంతి నటించగా, ఆపద్బాంధవుడు సినిమాకు వచ్చేసరికి విజయశాంతి కాల్షీట్లు లభించకపోవడంతో ఆ సినిమాకు మీనాక్షి శేషాద్రి అనే హీరోయిన్ తీసుకుని వచ్చారు . ఇలా చిరంజీవి మీనాక్షి శేషాద్రి కలిసి నటించినటువంటి ఏకాకి సినిమా ఆపద్బాంధవుడు. ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి ఆహాభావాలు చిరంజీవిని కట్టిపడే సాయని కే విశ్వనాథ్ ఓ సందర్భంలో చెప్పారు.
“నేను అనేక సినిమాల్లో చిరంజీవిని గమనించాను కానీ చిరంజీవి ఎప్పుడూ కూడా ఎవరికి గిఫ్టు ఇవ్వడం నేను చూడలేదు. అందునా హీరోయిన్లు అంటే చాలా జాగ్రత్తగా బిడియంగా ఉండేవాడు, అలాంటిది మీనాక్షి శేషాద్రికి భారీ గిఫ్ట్ తీసుకొచ్చి చిరంజీవి ఇచ్చాడంటే ఆశ్చర్యం వేసింది. ఈ విషయాన్ని నిర్మాత చెప్పడంతో ఒకసారి చిరంజీవిని అడిగాను ఏమి గిఫ్ట్ ఇస్తున్నావట ఈమధ్య హీరోయిన్లకి ఏంటి కథ అని అడిగాను“ దీంతో అతను ఏముంది గురువుగారు అని మౌనం వహించాడు.
దాన్ని బట్టి నాకు అర్థం అయింది. చిరంజీవి చాలా మంచి వ్యక్తి చిరంజీవి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు నేను చాలా తక్కువ మందిని గమనించాను. అని విశ్వనాథ సందర్భంలో చెప్పడం విశేషం.