అన్నగారు ఎన్టీఆర్ నటించినటువంటి సినిమాల్లో అనేకమైన హిట్లు ఉన్నాయి. ఆయన సొంతంగా దర్శకత్వం వహించినటువంటి ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయినటువంటి సినిమాలే. సాంఘిక సినిమాలకన్నా పౌరాణిక సినిమాలకు ప్రాణం పెట్టేవారు. డబ్బును సైతం లెక్కచేయకుండా పౌరాణిక సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడి చేసేవారు. దీనికి కారణం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఆ సినిమాలను ఆదరించేవారు.
దీంతో గ్రామాలకు గ్రామాలే తరలివచ్చి అన్న గారి సినిమాలను చూసేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. బళ్ళు కట్టించుకుని పట్టణాలకు వచ్చి రెండు రోజులు ఉండి రెండు మూడు షోలు చూసి వెళ్లినటువంటి పరిస్థితి కూడా అన్నగారి చరిత్రలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు చేసినటువంటి ఒక ప్రయోగం అందరిని ఆకర్షించింది. అదే దానవీరశూరకర్ణ సినిమా నిజానికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కర్ణుడిని హీరోగా చేయటం. మహాభారతంలో కర్ణుడు పాత్ర చాలా తక్కువ.
మహాభారతం మొత్తం మీద చూసుకుంటే కుంతీదేవి కర్ణుడిని జన్మించిన తర్వాత ఆ కర్ణుని వదిలిపెట్టడం నుండి మళ్ళీ అతను మళ్లీ ఎక్కడ పెరిగాడు అనేటటువంటి మహాభారతంలో పెద్దగా ప్రస్తావనకు వచ్చేటటువంటి అంశం కాదు. అయితే దుర్యోధనుడుతో సావాసం చేసిన తర్వాత మహాభారతంలో యుద్ధంలో కురుక్షేత్రంలో మాత్రమే కర్ణుడి ప్రస్తావన స్వల్పంగా ఉంటుంది.
అలాంటి ఒక అత్యంత తక్కువ నిడివి ఉన్నటు వంటి ఒక వ్యక్తిని హీరోగా పరిచయం చేయటం అతన్ని హీరోని చేయటం మహాభారతం మొత్తాన్ని ఒక ఒక మలుపు తిప్పినటువంటి కర్ణుడి అంశాన్ని తీసుకొని ఎవరూ చేయనటువంటి సాహసాన్ని అన్నగారి చేశారు. ఆ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అనేకమైనటువంటి రివ్యూలు వస్తున్నాయి. ఇప్పటికి సినిమా డైలాగులు కానీ సినిమా పాటలు గాని అందరి నోళ్ళల్లో వినిపిస్తూనే ఉంటాయి.
` ఏమంటివి ఏమంటివి` అనే డైలాగ్ రాజకీయాల్లో కూడా ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి డైలాగ్. ఈ చిత్రంలో కర్ణుడికి పాట పెట్టడం, కర్ణుని హీరోని చేయటం అనేది పెద్ద సంచలనం. ఈ సినిమాను 10 లక్షలు ఖర్చుపెట్టి చేశారు. ఈ పది లక్షల రూపాయల ఖర్చు నిజానికి అప్పటి బడ్జెట్ ని చూసుకున్నట్లయితే భారీ బడ్జెట్ అని చెప్పి నిర్మాతలందరూ నోళ్ళు వెళ్లపెట్టారు. పైగా కర్ణుడు సినిమాను ఎవరు చూస్తారండి పాత్ర ఎవరికి తెలుసు అండి అనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి.
అయినా అన్నగారు పట్టుబట్టి ఈ కర్ణుడి పాత్రని ఎలివేట్ చేశారు. ఇందులో అన్నగారు చేసినటువంటి ప్రయోగాలు చూసినట్టయితే అప్పటివరకు కూడా కేవలం సినిమా రంగానికి సంబంధం లేనటువంటి తిరుపతి వెంకట కవులను తీసుకుని వచ్చి సినిమాలకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో కర్ణుడి పాత్రకు రాసినటువంటి డైలాగులు హైలెట్. అదే విధంగా సి.నారాయణరెడ్డిని రేయింబవళ్లు తన వెంట తిప్పుకొని అన్న గారు పాటలు రాయించారు. కొన్ని కొన్నిచోట్ల సి నారాయణ రెడ్డి మాటలు రాసినటువంటి సినిమా ఇది ఒకటే.
అయితే ఆయన పేరు ఎక్కడ మనకు కనిపించదు. కానీ ఆయన మాటలు మాత్రం వినిపిస్తాయి. అదే విధంగా 10 లక్షలు ఖర్చు పెట్టేటటువంటి సినిమా సాధారణంగా రెండు మూడు నెలలు పడుతుంది కానీ అన్నగారు పెట్టినటువంటి టార్గెట్ కేవలం మండలం రోజుల్లో ఈ సినిమా ఇస్తానని ప్రకటించారు. పత్రిక సమావేశం పెట్టి దానవీరశూరకర్ణ సినిమాని తీస్తున్నాను కేవలం 40 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసేస్తామని చెప్పారు. కానీ మరో వైపు చూసుకుంటే అప్పటికి నటినటులు సంసిద్ధంగా లేరు. ఈ సినిమా ఆడుతుందో లేదో అనేటటువంటి భయంతో చాలామందిరాలేదు.
పైగా దీంట్లో కర్ణుడు కృష్ణుడు పాత్రలు అదేవిధంగా దుర్యోధనుడు పాత్ర ఈ మూడు చాలా ముఖ్యం దుర్యోధనుడు పాత్ర కృష్ణుడి పాత్ర వేరేవారితో చేయించి హీరో పాత్ర అయినటువంటి కర్ణుడు తాను చేయాలని అన్నగారనుకున్నారు. కానీ అనూహ్య కారణాల చేత ఆ మూడు పాత్రలు కూడా ఆయనే ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సినిమా మొత్తం గా చూస్తే ప్రతిఫ్రేం లోను అన్నగారు కనిపిస్తారు. ఇది బోర్ కొడుతుంది కదా అని చెప్పి చాలామంది అడిగారు.
దాన్ని కూడా అన్నగారు చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఈ చిత్రాన్ని అనుకున్న సమయంలో కేవలం 41 రోజులు అంటే 41 రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా సాధించిన విజయం అంతా కాదు 10 లక్షలు పెట్టినటువంటి ఖర్చు ఏకంగా కోటి రూపాయలు సంపాదించుకున్నారు. ఇదంతా కూడా అన్నగారు అహర్నిశలు చేసినటువంటి కృషి ఆయన పడ్డ తపన అనడంలో సందేహం లేదు.