సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ఏడాదికాలంగా టాలీవుడ్ లో బాగా వార్తల్లో ఉంటున్నారు. ఇక ఇప్పటికే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు ఓపెన్ గానే చెప్పేశారు. త్వరలోనే భార్యాభర్తలు కూడా అవుతున్నామని నరేష్ చెప్పాడు. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను పూర్తిగా నరేష్, పవిత్ర లోకేష్ కోణంలోనే తెరకెక్కించారు.
సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి పెళ్లి ఆలస్యానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి విడాకులు ఇవ్వకపోవడం పెద్ద కారణం. రమ్య ఇప్పటికే నరేష్‌కు విడాకులు ఇచ్చేసి ఉంటే వీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా కొత్త జీవితాన్ని ప్రారంభించే వారే.
ఇక వీరిద్దరు పెళ్లి చేసుకుంటే అది నరేష్ కు నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అవుతుంది. అసలు వీరిద్దరూ తొలిసారిగా ఎలా ? పరిచయమయ్యారు.. వీరిద్దరి మధ్య ఎలా ? ప్రేమ చిగురించింది అన్నదానిపై తాజాగా వీరు ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా బయటికి వచ్చింది. నరేష్ – పవిత్ర కలిసి 2018లో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమాలో నటించారు.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే నరేష్ తన భార్య రమ్యతో దూరంగా ఉంటూ వస్తున్నారు. నరేష్‌కు రమ్యకు మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. ఇక పవిత్ర తన భర్తకు దూరంగా ఉంటుంది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చివరకు అది నిజ జీవితంలో కూడా వర్కౌట్ అవడంతో వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు.
ముందుగా నరేష్ పవిత్ర కు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పవిత్ర కూడా నరేష్ ప్రేమను అంగీకరించింది. అప్పటికే ఆమె కూడా తన తన భర్తకు దూరంగా ఉంటోంది. అలా సుధీర్ బాబు సినిమాలో నటించడం ద్వారా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇక్కడ వరకు వచ్చింది. అలా పరోక్షంగా సుధీర్‌బాబు సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లయ్యింది.