సాధారణంగా అన్నగారు అంటే.. ఇండస్ట్రీకి గౌరవం. అంతేకాదు..చాలా మంది నటులు అన్నగారితో నటించేందుకు ఎదురు చూసేవారు. అంతేకాదు.. కొందరైతే.. అన్నగారితో నటించేందుకు.. అనేక చిత్రా లను వదులుకున్నవారు.. రెమ్యునరేషన్ తగ్గించుకున్నవారు కూడా ఉన్నారు. అయితే..అన్నగారితో నటించేందుకు జంకిన ఏకైక హాస్య నటుడు రాజబాబు. ఆయన మాత్రం అన్నగారంటే.. జంకేవారు.
ఎన్టీఆర్ సినిమాలో నటిస్తావా? అని దర్శకులు అడిగితే…“ఇంకోసారి చూద్దాంలేండి“ అని అనేవారట రాజబాబు. దీనికికారణం ఏంటాని కొందరు ఆరాతీశారు. మరికొందరు సరిపుచ్చుకున్నారు. ఇంతకీ విష యం ఏంటంటే.. అన్నగారితో నటించాలంటే.. పంక్చువాలిటీ పాటించాలి. ఆహార నియమాలు పాటించా లి. ఈ రెండు విషయాల్లో అన్నగారు చాలా సీరియస్. నిర్మాతను ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు.
అయితే..రాజబాబు మాత్రం వీటిలో ఒక్కదాన్ని కూడా పాటించేవారు కాదట. దీంతో ఆయన ఆయన అన్నగారి సినిమాల్లో పనిచేసి.. మాటపడడం ఎందుకని తప్పించుకునేవారట. పరమానందయ్య శిష్యుల కథ సినిమా విషయంలో ఇదే జరిగింది.అప్పటికే ఉత్తమ కమెడియన్గా రాజబాబు మంచిగుర్తింపే తెచ్చుకున్నారు.
అయితే అన్నగారితో కలిసి నటించిన సినిమా అదే. ఈ సినిమాలో ఆయన షూటింగులకు బాగాలేటుగా వచ్చేవారు. ఈ విషయం తెలిసి అన్నగారు ఓ సందర్భంలో కోప్పడ్డారు. “మీరు హాస్యనటులు.. హాస్యాన్ని తెరమీద చూపించాలి కానీ.. ఇలా నిర్మాతతో పరిహాసాలు చేయడం ఎందుకు? “ అని ప్రశ్నించారట. అంతే.. ఇక అప్పటి నుంచి రాజబాబు అన్నగారి సినిమాలు మానేశారని అంటారు.