భానుచందర్ ఒకప్పటి హీరో. ఆయన నటించిన అనేక సినిమాలు ఉన్నాయి. అయితే..నిరీక్షణ సినిమా భారీ హిట్. ఈ సినిమాలో భానుచందర్ ఒకటి రెండు సీన్లలో నగ్నంగా నటించారు. ఈ సినిమా చాలా హిట్టయింది. అయితే.. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం.. భానుచందర్.. ఒక ప్రతిష్టాత్మక సంగీత దర్శకుడు కుమారుడు కావడం. ఇప్పటికీ ఎంతో మందికి ఈ విషయం తెలియదు.
మాస్టర్ వేణు.. అని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమాలకు సంగీతం అందించారు. ఆయనచేతుల మీదుగా వచ్చిన అనేక సినిమాలు సంగీత భరితంగా కూడా భారీ హిట్ అయ్యాయి. ఆయన కుమారుడే భానుచందర్. ఈయనకు కూడా సంగీతం అబ్బినా.. దర్శకుడు దుక్కిపాటి మధుసూదనరావు సూచనల మేరకు సినిమాల్లో నటించడం వరకు చేరుకున్నారు. శోభన్‌బాబు.. హీరో కృష్ణ వంటివారికి సమకాలికుడుగా కూడా పనిచేశారు.
అయితే.. వారిలాగా భానుచందర్ హిట్లు కొట్టకపోవడానికి, సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. మాదాల రంగారావుతో స్నేహం. ఈయన కమ్యూనిస్టు భావాలు ఉన్న దర్శకుడు. విప్లవం.. ఉద్యమం పేరుతో మాదల రంగారావు అనేక సినిమాలు చేశారు. వాటిలో భానుచందర్ నటించారు. దీంతో భానుచందర్ అంటే.. కమ్యూనిస్టు అనే ముద్ర పడింది.
దీంతో అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. పైగా.. మాస్ ప్రేక్షకులకు చేరువకాలేక పోయాడు. కేవలం విప్లవ కథలతో వచ్చిన సినిమా కథానాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. ఇక, తను నటుడిగా ఎదుగుతున్న క్రమంలో ప్రయోగాలు చేయడం.. భానుచందర్‌కు కలిసి రాలేదు. దర్శకుడిగా ప్రయోగాలు విఫలమయ్యారు.
ఆ తర్వాత భానుచందర్ డ్రగ్స్‌తో పాటు ఇతర వ్యసనాలకు బాగా అలవాడుపడిపోయారు. దీంతో ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. వీటి నుంచి భయటపడేందుకు భానుచందర్‌కు కొన్ని యేళ్లు పట్టింది. ఈ టైంలో ఆయన కెరీర్ చాలా వరకు అయిపోయింది. లేకపోతే.. మరో కృష్ణ మాదిరిగానో.. మరో శోభన్‌బాబు మాదిరిగానో.. భానుచందర్ ఉండేవారనడంలో సందేహం లేదు.