పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున భారీ ప్రాజెక్టు కే కూడా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలుఉన్నాయి. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లోక నాయకుడు కమలహాసన్ కూడా నటించబోతున్నారట. కమల్ కూడా ఇప్పటి వరకు తన కెరీర్లో ఎవరు ఊహించని పాత్రలో కనిపించబోతున్నారని టాక్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కేలో కమల్ ప్రభాస్‌ను ఢీ కొట్టే బలమైన విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ పాత్ర చేసేందుకు కమల్‌కు రూ.150 కోట్ల భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట మేకర్స్. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన బయటికి రాలేదు. కమల్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందట. కమల్ విలన్ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.
అతి త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన కూడా రానుందంటున్నారు. బాహుబలితో లోకనాయకుడు కలిస్తే ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చెప్పక్కర్లేదు. ఈ రు. 150 కోట్ల రెమ్యునరేషన్ అంటే.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ సినిమాలో విలన్ పాత్రధారికి ఇంత రెమ్యునరేషన్‌తో ఇదో సరికొత్త రికార్డ్‌గా నిలవనుంది.