టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీబడ్జెట్‌తో నిర్మిస్తోన్న సినిమా పుష్ప 2. పుష్ప లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ టైంలో ఈ రోజు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం కొందరు ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తోన్న బస్సు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద హైవేపై ఆర్టీసీ బస్సును పరస్పరం ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. దీంతో పుష్ప 2 యూనిట్‌లోని ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో పుష్ప 2 టీం ప్రయాణిస్తోన్న బస్సు డ్రైవర్‌ది తప్పా లేదా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ది తప్పా అన్నది మాత్రం తెలియట్లేదు.
గాయపడిన పుష్ప 2 టీం మెంబర్స్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పూర్తిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక పుష్ప సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ కూడా పాపులర్ అయింది. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.