హీరోయిన్లు అలా ఉంటేనే త్రివిక్ర‌మ్‌కు న‌చ్చుతారా… ఇదేం టేస్ట్ రా బాబు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలీవుడ్‌లో తనదైన స్టైల్ లో ఎన్నో సూప‌ర్‌హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో చాలామంది దర్శకులకు సెంటిమెంట్లు ఉంటూనే ఉంటాయి. అలా సెంటిమెంట్ ఫాలో అయ్యే వారిలో త్రివిక్రమ్ పేరు మొదటగా వినిపిస్తుంది. త్రివిక్రమ్ తాను దర్శకత్వం వహించే సినిమాల్లో హీరోయిన్ల‌కు కచ్చితంగా ఏదో ఒక లోపాన్ని తగిలిస్తూ ఉంటాడు.

త్రివిక్ర‌మ్ దీనిని ఒక సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. త్రివిక్ర‌మ్‌ సినిమాల‌లో హీరోయిన్ల‌కి ఏ లోపాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. త‌రుణ్ హీరోయిన్ గా వ‌చ్చిన నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ శ్రీయా శరన్ పాత్ర చాలా అమాయకత్వంగా ఉంటుంది. ప్రతి విషయానికి ఇన్నోసెన్స్ తో సమాధానం చెప్పే లోపంతో శ్రీయ పాత్ర ఉంటుంది.

ఇక నితిన్ అ..ఆ సినిమాలో సమంతకు స్ట్రెస్ అనే ఒక లోపాన్ని తగిలించాడు. ఇందులో సమంత సినిమా మొత్తం స్ట్రెస్ బాల్ పట్టుకునే ఉంటుంది. జులాయిలో ఇలియానాను సోడాబుడ్డి కళ్ళతో, పంటికి క్లిప్ వేసి చూపిస్తాడు. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖ‌లేజా సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనుష్కకు ఐరన్ లెగ్ అనే లోపాన్ని తగిలించాడు. ఈ సినిమాలో ఆమె ఏ వస్తువు పట్టుకున్నా నాశనం అయిపోతూ ఉంటుంది.

అలా ఆమె పాత్ర‌ను ఐరన్ లెగ్ లా ఎక్స్‌పోజ్ చేశాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్‌, అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఇందులో అనూ ఎమ్మాన్యుయేల్ పాత్ర ప్రతిది పర్ఫెక్ట్‌గా ఉండే లోపంతో ఉండేలా డిజైన్ చేశాడు. అలా త‌న సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌కు ఏదో ఒక లోపం లేదా ఒక అల‌వాటు ఉండేలా డిజైన్ చేసుకోవ‌డం త్రివిక్ర‌మ్‌కు అల‌వాటుగా మారింది.