కృష్ణంరాజునట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం కోట్లాదిమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
టాలీవుడ్ లో రు. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మొదట ప్రభాస్ పేరు వినిపిస్తుంది.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న ప్రభాస్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడు. అయినా ప్రభాస్‌కు తన ఇన్‌స్టా ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. పది బిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ కేవలం తన ఇన్‌స్టాలో 15 నందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
అందులో 6 గురు హీరోయిన్లను కూడా ప్రభాస్ ఫాలో అవుతున్నారు.. ఆ హీరోయిన్స్ ఎవరో కాదు భాగ్యశ్రీ, శ్రద్ధా కపూర్, శృతిహాసన్, పూజ హెగ్డే, కృతీ సనన్, దీపిక పదుకొనే. చాలామంది స్టార్ హీరోయిన్లతో కలిసి నటించిన ప్రభాస్.. కేవలం ఆరుగురు హీరోయిన్లని మాత్రమే తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఈ హీరోయిన్లు అంటే ప్రభాస్‌కు చాలా స్పెషలా ? అన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి.
ప్రభాస్ ఇటీవల నటించిన చిత్రాల్లో ఆది పురుష్ సినిమా జూన్‌లో విడుదలవుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. ఇది ప్రభాస్‌కు మొదటి హిస్టోరికల్ సినిమా కావడంతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో భారీ అంచనాలే ఉన్నాయి.