స్టేజీ పైనే యాంకర్ సుమకు చెమటలు పట్టించిన రానా.. దెబ్బకు అందరి నోర్లు ఖతక్..!

దగ్గుబాటి కుటుంబం నుంచి ఇప్పటికే విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత వెంకటేష్ అన్న సురేష్ బాబు కొడుకు రానా లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్న రానా తన సినీ కెరీర్లో ఎక్కువగా మల్టీస్టార్‌ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలలో భ‌ళ్లాల‌ దేవుడిగా నటించి పాన్ ఇండియాలో పాపుల‌ర్ అయ్యాడు.

ఇక రానా సినిమాల‌తో పాటు బుల్లి తెర‌పై కూడా ప‌లు షోలు చేస్తు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా యంక‌ర్ సుమ చేస్తున్న సుమ అడ్డాషోకు రానా నిర్మిస్తున్న ప‌రేషాన్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ షోకు ఈ సినిమా న‌టిన‌టుల‌తో క‌లిసి వ‌చ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ షో ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ప్రోమోలో రానా సుమ‌పై పేల్చిన పంచ్‌ల వ‌ర్షం ఈ ప్రోమోకు హైలెట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మిడియ‌లో వైర‌ల్‌గా మ‌రింది.

ఈ షోకు రానాతో పాటు ప‌రేషాన్ సినిమాలో న‌టించిన తిరువీర్, ప్రణవి కరణం, దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ కూడా ఈ షోకు వ‌చ్చారు. ఇక సుమ ఈ ప్రోమోలో వారితో కొత్త కొత్త టాస్క్‌ల‌తో వారిని ఆడుకుంది. ముందుగా స్కుల్ అన‌గానే అంద‌రికి గుర్తుకువ‌చ్చే విష‌యం ఏంట‌ని సుమ అక్కడున్న వారిని అడిగింది.. ఇక అంద‌రు త‌మ‌కు న‌చ్చిన స‌మాధ‌నం చెబుతు వ‌చ్చారు. అయితే రానా మ‌త్రం అంద‌రి కంటే భిన్నంగా త‌న‌కు స్కుల్ అంటే గుర్తుకు వ‌చ్చే విష‌యం ప్లే గ్రౌండ్ అని చెప్పాడు. దీంతో రానాను సుమ మిగిలిన ఆన్స‌ర్లు చెప్ప‌మంటే ఆమె పై పంచ్‌ల వ‌ర్షం కురిపించాడు.

అంతే కాకుండా ఈ క్రమంలోనే బాహుబ‌లి సూప్ కూడా చేశారు. ఇక అందులో ఏం జ‌రిగింది దేవ‌సేన అని సుమ అడ‌గ‌గా..” నేను బిర్యాని ప్యాకెట్ కోసం లైన్‌లో వుంటే తిరువిర్ నాచేయ్యి లాగాడు “అంటూ చెప్పింది. వెంట‌నే రానా..” నువ్వేం చేశావు ” అని అడ‌గ‌గా..” నేను అత‌నీ వేలు న‌రికేశాని చెప్ప‌గా. ఇక వెంట‌నే రానా న‌ర‌కాల్సింది వేలు కాదు బిర్యాని ప్యాకట్” అంటూ అక్కడ‌ ఉన్న వారి అంద‌రిపై పంచులు వేశాడు.

ఇక త‌ర్వాత సుమ “ఎవ‌రితో స్నేహం ఎక్క‌వ కాలం ఉంటుంది ..?”అని అడ‌గ‌గా “చిన్ననాటి స్నేహితులతో” అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్ పెట్టగా..” ఆ సమాధానం రైట్ కాదని రూ.500 రూపాయలు పెడతానని” రానా అన్న‌డు. “ఇప్పటివరకు ఈ షోలో రూ.500 ఎవరూ ఇవ్వలేదని.. పట్టుకోవడానికి కూడా నామోషీగా ఉందని” సుమ చెప్పగా “ఇక్కడ పెట్టండి” అంటూ రానా మరో పంచ్ వేశాడు. కొంచెం పెట్టండి అని సుమ పంచ్ వేయగా రూ.500కు చిల్లర ఉందా అని రానా అడిగారు. సుమపై రానా వేసిన పంచ్ లు భలే పేలాయి. ఇక మొత్తానికి ఈ షో మొత్తం రానా పేరే హైలెట్ అయ్యింది..!