జెడి చక్రవర్తి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్లతో దూసుకుపోయిన హీరో. హీరోగానే కాక, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే జెడి.చక్రవర్తి నటించిన మనీ మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా ఎంత పాపులర్ సినిమాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి జెడీ చక్రవర్తి అంటే మనకు గుర్తుకు వచ్చేవి ఆ సినిమాలే. అయితే జేడీ కెరీర్ ఆరంభం నుంచి కథలను చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటూ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న జెడి.చక్రవర్తి ఇప్పటికి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ సెలెక్టివ్ గా సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హాట్ స్టార్ ఓటీడీటీ కోసం జేడీ తెలుగమ్మాయి ఈషా రెబ్బాతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న సిక్త్స్ సెన్స్‌లో ఈ జంట పాల్గొన్నారు. ఈ షోలో ఓంకార్ అడిగిన ప్రశ్నలకి టక్కున షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు జెడి చక్రవర్తి.
అసలు విషయానికొస్తే జెడి.చక్రవర్తిని ఓంకార్ మీరు ఎంతమంది స్టార్ హీరోయిన్స్‌తో కలిసి నటించారు కదా ? ఆ హీరోయిన్లలో ఎవరితో ప్రేమల పడ్డారు ? ఎవరిని ట్రై చేశారని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయేలా బోల్డ్ కామెంట్ చేశాడు జెడి చక్రవర్తి. మా నాన్నపై ఒట్టేసి చెప్తున్నాను.. నాతో పని చేసిన అందరూ స్టార్ హీరోయిన్లని ట్రై చేశానని చెప్పాడు. ప్రస్తుతం ఈ సిక్త్స్ సెన్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జేడీ ఇంత ఖిలాడీనా.. అంతమంది హీరోయిన్లను గోకాడా.. మనోడు పెద్ద రసిక రాజే అని నెట్టింట్లో ఒక్కటే రచ్చ స్టార్ట్ అయ్యింది.