యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కేరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ – 5 స్టార్ హీరోలో ఒకరిగా ఉన్నాడు. ఇక రాజామౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ పెంచుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీముడో పాటలో తన నటనతో తన విశ్వరూపమే చూపించాడు. ఈ సినిమా తర్వాత తన 30వ సినిమా స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దేవర అనే ఓ పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ జంటగా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించే రెండో హీరోయిన్ కోసం కొరటాల అన్వేషణ కూడా చేస్తున్నాడు.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్కు చిన్న గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశీ వెకేషన్ కి వెళ్ళాడు.
ఇక అక్కడ కూడా తగ్గేదేలే అన్నటుగా ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ జిమ్లో కసరత్తుల్లో ఉన్నాడు. అలాగే తన దేవర సినిమాలో అద్భుతమైన బాడీషేఫ్లో కనబడడం కోసం ఎన్టీఆర్ జిమ్లో బాగా కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియలో దుమ్ము రేపుతుంది. ఇక ఎన్టీఆర్ విదేశీ వెకేషన్కు వెళ్లే క్రమంలో తన ఫ్యామిలీతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.