పవన్ కళ్యాణ్ ‘ బ్రో షూ ‘ ఎందుకింత స్పెష‌ల్‌… మైండ్ బ్లాక్ అయ్యే మ్యాట‌ర్ ఇది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు.. ఇటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ రీసెంట్ టైమ్స్ లో కాస్ట్‌లీ వస్తువులతో సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఖరీదైన షూస్ తో ఒక్క‌సారిగా వార్త‌ల్లో ట్రెండ్ అవుతున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాను.. సౌత్ దర్శక నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.

Do you know the price of Pawan Kalyan shoes? Which company is that? Power  Star Bro Movie Poster Trending with Saidharam | Cost of Pawan Kalyan's  Balmain Unicorn shoes in Bro the

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతంకు రీమేక్ గా ఈ మూవీ ఇక్కడ తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్‌లు ఇస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ వదిలారు.. అందులో పవన్ కళ్యాణ్ బైకుపై కాలు పెట్టి నుంచోగా సాయి ధరమ్ తేజ్ పవన్ వెనకాల చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఈ మామ అల్లుళ్ళ లుక్స్ ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ కాస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

BRO Motion Poster: Stylish Yet Mystical

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో ఉన్న ఈ ష్యూస్ నెటిజ‌న్ల‌ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. దీంతో ఆ షూస్ ప్రైస్ ఎంత అంటూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.. గూగుల్ లో ఆ షూస్ కాస్ట్ చూసిన నెటిజ‌న్ల‌ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ధరించిన ఆ షూస్ ధర $1238 అమెరికన్ డాలర్స్. అంటే మ‌న ఇండియన్ కరెన్సీ లెక్క‌ల ప్ర‌కారం అక్షరాలా రూ. 1,02,227.అన్న‌మాట‌.. మొత్తానికి షూస్‌తోనే గూస్‌బంప్స్ తెప్పించిన ఈ మామ అల్లుళ్లు సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ? చూడాలి.