యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత 30వ సినిమా అని స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పాస్టర్ తో పాటు ఈ సినిమా టైటిల్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు “దేవరా” అనే ఓ పవర్ఫుల్ టైటిల్ ని పెట్టారు. ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం అలా ఉంచితే.. ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవకముందే బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించారు.
అలా ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడు గా నటించారు. ఈ సినిమా అప్పట్లో జాతీయస్థాయిలో ఉత్తమ బాలల చలనచిత్రంగా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన ఆ చిన్నారి నటనకు అప్పట్లో ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆమె క్యూట్ లుక్స్ తో పాటు ఎన్టీఆర్ పక్కన సీతగా తన అభినయంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక ఆ చిన్నారి పేరు “స్మిత మాధవ్”.
ఇప్పుడు ఆ చిన్నారి సీత ఎలా ఉందో చూస్తే అందరూ ఆశ్చర్యపోక మానరు. స్మిత మాధవ్ కర్ణాటక క్లాసికల్ సింగర్. అంతేకాకుండా భరతనాట్యంలో మంచి డాన్సర్. ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సంగీత నృత్యంలో డిప్లమా కోర్స్ పూర్తి చేసింది. ఈ విధంగా బాల రామాయణంలో సీత పాత్రలో నటించిన స్మిత మాధవ్ రీసెంట్ గా వచ్చిన ఆర్ట్ ఫిలిం పృద్విలో కూడా హీరోయిన్ గా చేసింది. బుల్లితెర షోలలో యాంకర్ గా కూడా చేస్తోంది. అలాంటి స్మిత మాధవ్ ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చూడండి..!!