ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒకరు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటారు.. ప్రధానంగా వారు చదువుకునే చదువుకు సంబంధం లేకుండా ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలని అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అందరికీ వచ్చిన పనులు కొందరికి రాకపోతే వారిని ఎంతో చులకనగా చూస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆ పనులపై వారికి ఇంట్రెస్ట్ లేదు అని మాత్రం వదిలేయరు.. వారిని ఎక్కిరిస్తూ ఏంటి నీకు అది రాదా ఇది రాదా అంటూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరికి బైక్ నడపడం అంటే భయం ఉంటుంది.. అందుకే డ్రైవ్ చెయ్యరు. మరికొందరికి వారు పెరిగిన పల్లెటూరి వాతావరణం కారణంగా టెక్నికల్ అంశాలపై అవగాహన ఉండదు. ఇలా కొందరికి కొన్ని పనులు రావు. ఇప్పుడు మీకు ఇద్దరు టాలీవుడ్ హీరోలను పరిచయం చేయబోతున్నాం.. వారిలో ఒకరికి బైక్ నడపడం రాదు.. మరొకరికి ఫోన్ పే, గూగుల్ పే వంటివి చేయడం కూడా తెలియదు. ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం.
రానా దగ్గుబాటి: తన ఒంటి చేత్తో దున్నపోతుని సైతం హతమార్చ గల ఈ కండలువీరుడికి బైక్ నడపడం రాదు అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం.. ఇదే విషయాన్ని రానా స్వయంగా రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు బైక్ నడపటం తెలియదని అంతేకాకుండా బైక్ బాగా నడిపే వాళ్ళంటే తనకి ఇష్టమని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నాచురల్ స్టార్ నాని : నాచురల్ స్టార్ నాని కూడా టెక్నికల్లీ హ్యాండీక్యాప్డ్ అంటూ తనకు తానే చూప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే విషయం అందరికి ఆశ్చర్యాని కలిగిస్తుంది.ఎందుకంటే తనకు ఫోన్ పే, గూగుల్ పే వంటివి వడటం తెలియదని కనీసం ఫుడ్ ఎలా ఆర్డర్ చెయ్యాలో కూడా తనకు ఏమాత్రం తెలియదని దసర సినిమా ప్రమోషన్స్ నాని చెప్పడు, ఇక ఈ ఇద్దరి హీరోలకి సంబందించిన ఈ విషయం సోషల్ మిడియలో వైరల్‌గా మరింది.