హీరోయిన్లను మించిన అందంతో వెంకీ కూతురు… ఫొటోల‌తోనే మ‌తులు పోగొట్టేస్తోందిగా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖ‌చ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. వెంకీ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ జాతర లాగా కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తూ నేటితరం యువ హీరోలకు కూడా గట్టి పోటీ చేస్తున్నాడు.

అలాగే యువ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు వెంకటేష్. వెంకటేష్ సినిమాలు గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం ఎప్పుడు ఎవరికీ తెలియకుండానే ఉంచుతూ వచ్చాడు. ఇప్పటివరకు వెంకటేష్ భార్య బయట కనిపించడం కూడా చాలా అరుదుగా చూసి ఉంటాం.

Glimpse of Venkatesh Daggubati's daughter's wedding | Telugu Movie News -  Times of India

కానీ ఆయన చిన్న కూతురు అశ్రిత మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.. 2019లో వినాయక్ రెడ్డి అనే అబ్బాయి తో పెళ్లి కూడా జరిగింది. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈమె సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ దగ్గరయింది. ఆశ్రితకు కుకింగ్ అంటే ఎంతో ఇష్టం.. సోషల్ మీడియాలో కూడా ‘ఇన్ఫినిటీ ప్లాటర్‘ అనే అకౌంట్ క్రియేట్ చేసుకుని తన వ్యక్తిగత విషయాలను, వీడియోలను, ఫోటోలను వాటితో పాటు తనకి ఇష్టమైన కుకింగ్ గురించి కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వాటికి లక్షల కొద్ది లైక్స్ వ్యూస్ వస్తుంటాయి.

Venkatesh Daughter Aashritha Daggubati Birthday Special Pic | వయసెంతో  చెప్పిన వెంకీమామ కూతురు.. ఆశ్రిత దగ్గుబాటి బర్త్ డే స్పెషల్ పిక్ News in  Telugu

సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలకు ఫోటోలకు ఎక్కువ వ్యూస్ మరియు రిచ్ వస్తే వాటికి డాలర్ల రూపంలో డబ్బులు ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆశ్రిత ఈ విధంగా ఒక్కో పోస్టుకి 400 డాలర్లకు పైగా డబ్బును సంపాదిస్తూ సోషల్ మీడియాలోనే ఇన్‌స్టాగ్రామ్ లో రిచ్ సెలబ్రిటీగా కొనసాగుతుంది.అంతేకాకుండా ఆమె అందం అభినయం లుక్స్ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కంటే ఎంతో కలర్ ఫుల్ గా ఉంటుంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఉంటే మాత్రం పెద్ద స్టార్ స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ ఆశ్రిత ఎందుకో ఇటువైపు రాలేదు.

Daggubati Venkatesh Daughter Aashritha In Instagram Rich List Photo Gallery  - Sakshi

తాజాగా ఆశ్రిత లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఈమె తన అందంతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ ఫోటోలు చూసిన జనాలు ఎంతో భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. ఆశ్రిత ఇంత అందంగా ఉంది ఏంటి.. చూస్తుంటే ఏముంది రా బాబు అనే విధంగా కామెంట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.