చిన్ననాటి ఫోటోలను మనం ఎంతో అపురూపంగా దాచుకుందాం.. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతిలోకసుందరి శ్రీదేవి సినిమాలో కూడా బాలనటిగా నటించిన ఈ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. పై శ్రీదేవి పక్కన ఉన్న అందాల ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..?
ఆ చిన్నారి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మీనా.. సౌత్ ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం లేని పేరు.. బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి.. తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించింది. తెలుగు- తమిళ చత్ర పరిశ్రమలో 1991 నుంచి 2001 వరకు సుమారు ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్‌గా వెలిగింది.
ముఖ్యంగా వెంకటేష్‌తో ఎక్కువ విజయలు అందుకుంది. ఆయనతో నటించిన ‘సుందర కాండ’, ‘చంటి’, ‘సూర్య వంశం’, ‘అబ్బాయిగారు’ వంటి మూవీస్ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. బాలయ్యతో.. ‘బొబ్బిలి సింహం’, . ‘ముద్దుల మొగుడు’.. చిరంజీవితో ‘స్నేహం కోసం’, ‘శ్రీ మంజునాథ’, ముఠా మేస్త్రి’ లు చేసింది మీనా. ఇటీవలి కాలంలో దృశ్యం సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.
ఇక 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. ఇక వీరికి నైనికా అనే ఒక కూతురు కూడా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు సినిమాతో మీనా కూతురు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే గత ఏడాది జూన్ 28న చెన్నైలోనే ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ కొవిడ్ సమస్యలతో మీనా భర్త మరణించారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మీనా.