కుటుంబం అన్నాక సమస్యలు రావడం సహజం.. కానీ ఆ సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా ఆ కుటుంబంలోనే ఆ సమస్యలను పరీక్షించుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు.. అలా కాదని బయట రోడ్డు ఎక్కి నాన్న హంగామా చేయటమే కాకుండా కోర్ట్ – పోలీస్ స్టేషన్ లు అంటూ తిరుగుతూ కుటుంబ పరువుని వీధిపాలు చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే.. సినీ సెలబ్రిటీల ఫ్యామిలీ విషయంలో ఏ చిన్న విషయం జరిగిన అధి క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే తమ తల్లిదండ్రుల నుంచి తమ ఆస్తులను ఇప్పించాలని పోరాటం చేసిన హీరోయిన్లు కూడా లేకపోలేదు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
కుష్బూ: చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన కుష్బూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా అలరించింది. ఇక ఇప్పుడు అవకాశాలు తగ్గుతున్న సమయంలో బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇకపోతే అప్పట్లో ఆస్తుల కోసం తన తల్లిదండ్రులపై కేసు వేసింది. మరొక సంచలన విషయం ఏమిటంటే తనకు తండ్రి అనే వాడే లేడు అంటూ సంచల వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
అమీషా పటేల్ : పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ అమీషా పటేల్.. ఈమె కూడా తన తల్లిదండ్రులు తన డబ్బును తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని కేసు పెట్టింది. అంతేకాకుండా తన తండ్రిపై రూ.12 కోట్లకు దావా కూడా వేసింది.
వనిత విజయ్ కుమార్: ముఖ్యంగా ఆస్తుల కోసం తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన స్టార్ హీరోయిన్లు అనగానే ముందుగా వనిత విజయ్ కుమార్ పేరు వినిపిస్తుంది. తండ్రి విజయ్ కుమార్ ఈమెకు ఒక్క రూపాయి కూడా ఆస్తి ఇవ్వకపోగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు . దీంతో చెలరేగిపోయిన వనిత ఆస్తి కోసం తన తండ్రి పైన కేసు వేసింది. తల్లి మంజుల ఆస్తిని విజయకుమార్ లాగేసుకున్నాడు అని, తనకు ఇవ్వడం లేదు అంటూ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది.
సంగీత: టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత కూడా తన తల్లి తండ్రులపై అనేక ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తనను వారి విలాసాల కోసమే వాడుకుంటున్నారని, తన భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా వీరు మాత్రమే కాకుండా ప్రముఖ హీరోయిన్ రాశీ, లిజి, కాంచనమాల వీరంతా కూడా తల్లిదండ్రులపై కేసులు వేసి ఆస్తికోసం కోర్టు మెట్లు ఎక్కిన వారే.