పత్రికల్లో గ్యాసిప్ వార్తలు వస్తుంటాయి. అంటే.. లేనిది ఉన్నట్టు లేదా, జరగబోయేదానిని ఊహించి రాయ డం వంటివి గ్యాసిప్గా మారతాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగి..ప్రజల్లో ఇంట్రస్ట్ ఏర్పడుతుంది. ఈ గ్యాసిప్ అనే పదం.. వార్తలు కూడా జర్నలిజం పుట్టిన నాటి నుంచి ఉండడం గమనార్హం. వీటిని కొందరు కావాలని రాయించుకునేవారు. తమకు పలుకుబడి పెరిగేందుకు.. లేదా తమ గురించి చర్చించేందుకు కొందరు గ్యాసిప్లను ప్రచారం చేసేశారు.
ఇలా.. మీడియాలో ఎక్కువగా గ్యాసిప్‌లు ప్రచారం చేసేవారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కూడా ప్రచారం చేసేవారు. అయితే.. దీనివల్ల కొంత లాభం ఉన్నా.. ఎక్కువగా నష్టం ఉండేది. మొదట్లో ఇలా గ్యాసిప్‌లు రాయించింది… ఒకరిపై ఒకరు గిట్టనివారే. తమిళనాడు ఇండస్ట్రీలోకి కన్నడ ఆర్టిస్టులు రావడం జీర్ణించు కోలేకపోయిన.. కొందరు తమిళ నిర్మాతలు.. డబ్బులు ఇచ్చి గ్యాసిప్‌లు రాయించారు. తమిళ సంప్రదా యాలు నాశనం అవుతున్నాయని గగ్గోలు పుట్టించారు.
దీంతో పరభాషా నటులకు తమిళనాడులో ప్రాధాన్యం తగ్గింది. ఇక, సావిత్రి-అన్నగారు రామారావు అనేక సినిమాల్లో కలిసి నటించారు. అయితే.. వీరి మధ్య కూడా ఎఫైర్ ఉందనే ప్రచారం వచ్చింది. ఇది భారీ ఎత్తున పాపులర్లోకి వచ్చింది. దీంతో తప్పంతా సావిత్రిదేనని.. ఎన్టీఆర్‌ను కెలుకుతోందని.. రాసుకొచ్చా రట. దీనిని చూసిన ఎన్టీఆర్ ముందు ఆశ్చర్యపోయి.. ఈ పత్రికల వారికి పని పాటాలేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. సావిత్రి మాత్రం కొంత లోతుగా దీనిని ఢీకొట్టే ప్రయత్నం చేసింది. పైగా లైట్ తీసుకునే మనస్తత్వం. ఇంతకీ.. ఈ గ్యాసిప్ ఎందుకు ఎవరు? రాయించారనే విషయాలను ఆరా తీయగా.. తన వల్ల నష్టపోయిన ఓ నిర్మాత ఇలా పనిగట్టుకుని.. తనకు బ్యాడ్‌నేమ్ వచ్చేలా చేశారని గుర్తించి.. ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. ఇదీ.. జరిగింది.