అన్నగారు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో అనేక సినిమాలు చేశారు. దాదాపు అన్నీ కూడా హిట్ సాధించా యి. అయితే..ఆయన ఎక్కువగా పౌరాణిక సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కొన్ని సాంఘిక సినిమాలు చేశారు. కానీ, పౌరాణికాలతో పోల్చుకుంటే..సాంఘిక కథా సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇదిలావుంటే.. అన్నగారు… దాన వీరశూర కర్ణ సినిమాను ప్లాన్ చేశారు. దీనిలో ఎక్కువ మంది నటులుమనకు కనిపిస్తారు.
మయ సభ.. పాంచాలి..వంటి అనేక పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. దీంతో నటీనటుల కు డిమాండ్ పెరిగింది. ఇక, దుర్యోధనుడిని హీరో చేసిన సినిమా ఇదే కావడం అన్నగారి జీవితంలో మరపులేని విషయం. మరి దుర్యోధనుడి పక్కన హీరోయిన్‌గా నటించేవారు ఎవరు ? అని చర్చ సాగింది. దీంతో అప్పటికి ఫామ్‌లో ఉన్న జయప్రదను అనుకున్నారు. ఆమెకు కుదరలేదు.
అనూహ్యంగా ప్రభ విషయం తెరమీదికి వచ్చింది. అన్నగారి సోదరుడు త్రివిక్రమరావు ప్రభ విషయాన్ని చెప్పారు. ఆమె హైటు.. ముఖవర్ఛస్సు వంటివి వివరించారు. దీంతో అన్నగారు ఆడిషన్సుకు పిలిచారు. ఆమె వచ్చీరావడంతోనే అన్నగారికి సూటబుల్ అనుకుని ఫిక్స్ చేశారు. సినిమాకు ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్ 50 వేలు. కానీ, చివరిలో ఆమె నటన బాగుందని గతంలో ఎన్నడూ లేని విధంగా మరో 10 వేలు ఇచ్చిఅన్నగారు ఘనంగా సత్కరించారు.