పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి. అయితే ఆశిష్ విద్యార్థికి 20 ఏండ్ల కిందట నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి దాంపత్యంలో కలతలు రావడంతో విడిపోయారు.
అయితే అశిష్ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియలో వైరల్గా మరాడు. అశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రూపాలి బారువ గురించి ఎవరికి తెలియని కోన్ని షాకింగ్ విషయలు బయటకు వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రూపాలి బారువా స్వస్థలం గౌహతి. ఈమెకు సొంతంగా ఫ్యాషన్ స్టోర్ ఉంది. రూపాలి బారువా వయస్సు ప్రస్తుతం 50 సంవత్సరాలు అని సమాచారం అందుతోంది.
ఒక రుపాలి బిరోవా కోట్ల ఆస్తికి వారసురాలు . అంతేకాదు మల్టీ టాలెంటెడ్.. ఎలాంటి బిజినెస్ నైనా సరే పడిపోతున్న స్థాయి నుంచి టాప్ స్థాయి నిలబెట్టగలదు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఫ్యాషన్ డిజైనర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా రూపాలికి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
అశిష్ తన వ్లాగ్స్ లో భాగంగా ఒకసారి రూపాలిని కలవడం జరిగిందని ఆ సమయంలో ఫోన్ నంబర్లను మార్చుకోవడం జరిగిందని సమాచారం అందుతోంది. ఇక కొందరు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తుంటే..మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈవయసులో పెళ్ళి చేసుకుని ఏం పీకతాడో చూద్దాం అంటూ జనాలు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.