ఢిల్లీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే వరుసగా మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొట్టింది. అలాగే జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగాను నటించింది. చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉండే రాశీఖన్నా మారుతున్న కాలంతోపాటు మనము మారాలి అన్న మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అంతా వెబ్‌సీరిస్ హవా నడుస్తోంది.
దీంతో అటు వెండి తెరకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ దూసుకుపోతుంది. రాశిఖన్నా సొంత ఊరు ఢిల్లీ. అక్కడ సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ విద్య అభ్యసించిన రాశీ లేడీస్ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువులో రాశీ ఇప్పుడు ముందు వరుసలో ఉండేది. అంతేకాదు ఆమె కాలేజ్ టాపర్ కూడా. ఇక సింగర్ కావాలన్నది ఆమె కల. కొంతకాలం మ్యూజిక్ లోను శిక్షణ తీసుకుంది.
అయితే ఆమె సినిమా హీరోయిన్ అవటం చాలా చిత్ర విచిత్రంగా జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో ఫ్రీగా వచ్చే ఫెయిర్నెస్ క్రీమ్ కోసం ఆమె ఒక సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ సెల్ఫీ చూసిన మద్రాస్ కేఫ్ డైరెక్టర్ ఆమెకు తన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె పోషించింది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన ఊహలు గుసగుసలాడే విజయంతో బిజీ అయిపోయింది.
వరుసగా సుప్రీమ్ – జై లవకుశ – తొలిప్రేమ – వెంకీ మామ – పక్కా కమర్షియల్ – వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో పాటు అటు తమిళంలో సర్దార్ – మేధావి – సైతాన్ కి బచ్చా లాంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌ల మీద రాశి కాన్సన్ట్రేషన్ చేస్తోంది. సిద్ధార్థ మల్హోత్రా సరసన యోధ అనే సినిమాలో నటిస్తోంది. ఇక రుద్ర అనే వెబ్ సిరీస్‌తో వెబ్‌తెర మీద ఎంటర్ అయ్యి అక్కడ కూడా ఖాళీ లేని కాల్ షీట్లతో బిజీబిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన సర్జి అనే మరో వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ లో ఉంది.