అక్కినేని నాగార్జునకు నట వారసుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు అఖిల్. తాజాగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అఖిల్ కి మళ్ళి చుక్కెదురైంది. మొదటి షోకే ఏజెంట్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. అఖిల్ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు డిజాస్టర్లు ( ఒక్క మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మినహా) కావడంతో అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయ్యగారు ఇక మీకు సెట్ అవ్వని యాక్టింగ్ మానేసి ఇకనైనా నాగార్జున బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఫీల్డ్ లో అయినా సక్సెస్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంత మంది జిమ్ కు వెళ్లి కండలు పెంచితే సినిమాకు సరిపోదని.. ఆ సినిమాలో మంచి పట్టు ఉండాలి ముందు అది తెలుసుకో అఖిల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కథను ఎంచుకునే విధానంలో అఖిల్ ఎప్పటికప్పుడు తప్పు పైన తప్పులు చేస్తూనే ఉన్నాడు. అయితే ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిందని అక్కినేని ఫ్యాన్స్ ఒప్పుకున్నా సరే అఖిల్ కి మాత్రం ఆ విషయం అర్థం కావడం లేదన్న చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.
అఖిల్ దురదృష్టమా లేక మరి ఏదైనా కారణమో కానీ అఖిల్ లా కూడా యాక్టింగ్ రాని చాలామంది ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. అఖిల్ కి మాత్రం తన ప్రతి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అఖిల్ పై ఎవరో కావాలనే కక్ష సాధిస్తున్నారని అతని సినిమాలు ఆడకుండా చేస్తున్నారు అని.. దీనిపై నాగార్జున ఎందుకు ? స్పందించడం లేదని అక్కినేని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ మాత్రం తాను ఏదో విజయం సాధించేసినట్టు తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో కొంతమంది నెటిజన్స్ అఖిల్ అసలు ఏం చేస్తున్నాడు అతడికే తెలియడం లేదని సినిమా డిజాస్టర్ గా మిగిలిందన్న బాధ కూడా లేకుండా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.