ఏపీలో వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీకి చెక్ పెట్టేలా టిడిపి అధినేత చంద్రబాబు రకరకాల ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వైసిపికి ముందు నుంచి కంచి కోటలుగా ఉంటున్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో ఈసారి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు చాప కింద నీరులా ప్రణాళికలు రచిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని ఏడు ఎస్టీ నియోజకవర్గాలలో పోలవరంలో మినహా అన్ని నియోజకవర్గాలలోను వైసీపీ జెండా ఎగిరింది.
ఇక 2019 ఎన్నికలలో 36 ఎస్టి, ఎస్సీ నియోజకవర్గాలలో రాజోలు, ప్రకాశం జిల్లా కొండపి మినహా అన్ని నియోజకవర్గాలలోను వైసిపి ఘనవిజయం సాధించింది. రాజోలులో జనసేన కొండపిలో టిడిపి మాత్రమే గెలిచాయి. అయితే ఈసారి చంద్రబాబు ఈ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నారు. ఇప్పటికే చాలా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సంకేతాలు కనపడుతున్నాయి.
ప్రకాశం జిల్లా కొండపి, సంతనూతలపాడు, గుంటూరులో వేమూరు, ప్రత్తిపాడు, తాడికొండ, కృష్ణాలో నందిగామ, పశ్చిమలో గోపాలపురం, కొవ్వూరు, తూర్పుగోదావరిలో రాజోలు, అమలాపురం, విశాఖలో పాయకరావుపేట, విజయనగరంలో పార్వతిపురం, శ్రీకాకుళంలో రాజాం లాంటి నియోజకవర్గాలతో పాటు ఎస్టీ నియోజకవర్గాల్లో పోలవరం, కురుపాం లాంటి చోట్ల ఈ సారి టీడీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది.
అలాగే సీమలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి సైలెంట్ షాకులు తప్పేలా లేవు. ఇక్కడ చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలతో పాటు ఇప్పటి నుంచే సరైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అటు జగన్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు ఈ సారి ఆయా వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత బలంగా ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో పెద్ద షాకులే తగలనున్నాయి.