90ఎంఎల్‌కు పోతే.. ఫుల్ పీకాల్సి వ‌స్తోంది..!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న కార్తికేయ ఇప్పుడు 90ఎంఎల్ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చాడు. గ‌త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న కార్తికేయ దాన్ని నిల‌బెట్టుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి. అయితే ఈచిత్రం విడుద‌ల త‌రువాత అభిమానులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇక్క‌డే ఓ తిర‌కాసు వ‌చ్చి ప‌డింది కార్తికేయ‌కు. కార్తికేయ చేసిన ఈ ప‌నికి త‌నే ఫ‌లితం అనుభ‌విస్తున్నాడు.

ఇంత‌కు కార్తికేయ చేసిన ప‌ని ఏమిటీ.. అనుభ‌విస్తున్న‌దేమిటీ అనుకుంటున్నారా..?  వాస్త‌వానికి 90ఎంఎల్ చిత్రం టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన ప్రేక్ష‌కులు సినిమాపై భారీ అంచానాలు వేసుకున్నారు. ఈ సినిమా విడుద‌ల అయిన త‌రువాత అభిమానుల అంచ‌నాలు ఫ‌టాపంచ‌ల‌య్యాయి. అయితే ఇక్క‌డే కార్తికేయ చేసిన ఓ త‌ప్పు ప‌ని ఇర‌కాటంలో ప‌డేసింది కార్తికేయ‌ను. కార్తికేయ చేసిన ఓ తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న ఇక్క‌ట్ల పాలు చేస్తుంది. 90ఎంఎల్ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్ష‌కుల అభిప్రాయాలు వెల్ల‌డికాక‌ముందే కార్తికేయ సినిమాను హిట్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఇక అక్క‌డ మండింది అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు. సినిమా విడుద‌ల అయిన త‌రువాత ఫ‌లితం ఎలా ఉన్నా హీరో కొంత స‌మ‌య‌నం పాటించాలి. కానీ కార్తికేయ మాత్రం అభిమానులు అభిప్రాయాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించారు. సినిమా ప‌ర‌మ చెత్త‌గా ఉంద‌ని, సినిమా చూసిన త‌రువాత ఫుల్ ప‌ట్టించాల‌ని, అస‌లు సినిమాను చూసి న‌వ్వాలో ఏడ్వాలో అంతు చిక్క‌డం లేద‌ని, కార్తికేయ నేల విడిచి సాము చేశాడ‌ని, మాస్ హీరో అవ్వడం కోసం క‌థ‌ను వ‌దిలేసాడ‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ట్రోల్ చేస్తున్నారు. దీంతో కార్తికేయ మాత్రం విభేదిస్తూ.. సినిమా బాగా ఆడుతుంద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే సినిమా యూనిట్ ఏ సెంట‌ర్ల‌లో ఎలాగు ఆడ‌దు.. ఆందుకే మాస్ ప్రేక్ష‌కులు బీ సీ సెంట‌ర్ల‌లో ఎంజాయ్ చేస్తార‌ని ముందుగానే గ్ర‌హించి అదే విధంగా అడుగులు వేస్తున్నారు.

Tags: 90ML Movie, Flop, Kartikeya Creative Workers, Kartikeya Gummakonda, Tollywood