జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫైయింగ్ టోర్నీలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ ఛాంపియే ఛాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్ లోకి రాకుండానే నిష్క్రమించింది. ఇక టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన జింబాబ్వే జట్టు తప్పకుండా గెలవ వలసిన మ్యాచ్‌లో తడబడి ఓడిపోయింది. జింబాబ్వే జట్టు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులు తేడాతో ఓడిపోయింది.
ఒక విధంగా చెప్పాలి అంటే జింబాబ్వే కాస్త గర్వంతోనే ఆడి ఈ మ్యాచ్‌లో ఓడిపోయినట్టు కనపడుతుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41 ఓవర్లలో 203 పరుగులకు ఆలవుటై ఓడిపోయింది.
ఇక 2019 లోను జింబాబ్వే జట్టు క్వాలిఫై టోర్నీలోనే వెనుదిరిగింది. ఈసారి వెస్టిండీస్ ను జింబాబ్వే ఓడించడంతో ఆ జట్టు ఎలాగైనా ప్రపంచకప్ ఆడుతుందని భావించారు. అయితే సూపర్ సిక్స్ లో వరుసగా శ్రీలంక – స్కాట్లాండ్లతో జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోవడంతో జింబాబ్వే దాదాపు ఇంటి బాట పట్టినట్లు అయింది. ఇక ఈనెల 6న నెదర్లాండ్స్ తో జరిగే తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే ఎలాంటి ? సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగానే ప్రపంచకప్ కు అర్హత పొందుతుంది.
ఒకవేళ నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడిపోయిన కూడా నెదర్లాండ్స్ కంటే రన్ రేట్ తక్కువ కాకుండా చూసుకున్న స్కాట్లాండ్‌కే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. అయితే నెదర్లాండ్స్ ప్రపంచకప్ కు అర్హత సాధించాలి అంటే స్కాట్లాండ్ పై భారీ విజయం సాధించాల్సి ఉంది.
ఇక శ్రీలంక ఇప్పటికే భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రపంచకప్‌లో పాల్గొనే 10వ జట్టుగా స్కాట్లాండ్ – నెదర్లాండ్స్ లో ఏ జట్టు నిలుస్తుంది అన్నది ఈనెల 6వ తేదీతో తేలిపోనుంది.