2023లో ఫస్ట్ డే క‌లెక్ష‌న్ల‌లో దుమ్ములేపిన సినిమాల లిస్ట్ ఇదే… ఫ‌స్ట్ ప్లేస్ ఎవ‌రంటే..!

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో రిలీజైన‌ కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ కాగా. అతి తక్కువ బడ్జెట్‌తో రిలీజైన‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్‌గా నిలిచాయి. ఇక కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా మొదటి రోజు రిలీజ్‌కి ముందు వచ్చిన పాజిటివ్ టాక్ తో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టాయి. అసలు విషయానికి వస్తే 2023లో విడుదలైన సినిమాల్లో ఫస్ట్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేవో ఒకసారి చూద్దాం.

ఆదిపురుష్ :
ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.32.84 కోట్ల షేర్ రాబట్టింది. 2023లో ఫస్ట్ డే అత్యధిక వసూలు కొల్లగొట్టిన సినిమా ఇదే.

వీరసింహారెడ్డి :
నట‌సింహ నందమూరి బాలయ్య హీరోగా తరికెక్కిన వీరసింహారెడ్డి మొదటిరోజు కలెక్షన్లు రూ.25.35 కోట్లు కొల్ల‌గొట్టి 2వ స్థానంలో నిలిచింది.

వాల్తేరు వీరయ్య :
చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య మొదటి రోజు రూ.22.90 కోట్ల షేర్‌ వసూలు చేసింది.

దసరా :
నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన దసరా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రూ.14.22 కోట్లు రాబ‌ట్టింది.

విరూపాక్ష :
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష‌ సినిమా మొదటిరోజు రూ.4.79 కోట్ల షేర్ వసూలు చేసింది.

రావణాసుర :
రవితేజ హీరోగా రూపొందించిన‌ రావణాసుర సినిమా ఫస్ట్ డే రూ.4.29 కోట్లు కొల్లగొట్టింది.

స్పై :
నిఖిల్ సిద్ధార్థ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా స్పై. ఈ సినిమా మొదటి రోజు రూ.4.28 కోట్ల వసూలు చేసింది.

ఏజెంట్ :
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ హీరోగా తెరకేక్కిన సినిమా ఏజెంట్. ఈ సినిమా మొదట రోజు రూ.4 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.

వారసుడు :
విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన సినిమా వారసుడు. ఈ సినిమా మొదటిరోజు రూ.3.10 కోట్ల భారీ బడ్జెట్ కొల్లగొట్టింది.

దాస్ కా ధ‌మ్కీ :
విశ్వక్సేన్ హీరోగా డైరెక్టర్ గా విలన్ గా మల్టీ ట్రోల్ ప్లే చేసిన మూవీ దాస్ కా ధ‌మ్కి. ఈ సినిమా తొలి రోజు రూ.3.6 కోట్ల షేర్‌ రాబట్టింది.

సార్ :
ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన మూవీ సార్. తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు రూ.2.65 కోట్ల షేర్‌ రాబట్టింది.

బేబీ :
వైష్ణవి చైతన్య హీరోయిన్గా, ఆనంద్ దేవరకొండ, విరాజ అశ్విన్ నటించిన బేబీ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.60 కోట్ల వసూలను కొల్లగొట్టింది.

కస్టడీ :
నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా శరత్ కుమార్, అరవింద్ స్వామి కీరోల్‌ ప్లే చేసిన మూవీ కస్టడీ. ఈ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.82 కోట్ల షేర్లను వసూలు చేసింది.