ఓల్డ్ తెలుగు హీరోయిన్లలో కొందరు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. మరికొందరు విచ్చలవిడిగా ఉండే వారు. అయితే.. సీనియర్ నటులు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన యువ నటీమణులు మాత్రం కొంత వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. వారంతా ఆర్థికంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారిలో శ్రీలక్ష్మి ఒకరు.
మిథునం సినిమాలో తన ప్రతిభను చాటుకున్న శ్రీలక్ష్మి.. దీనికి ముందు కూడా.. అనేక సినిమాల్లో విశ్వ రూపం చూపించారు. అయితే.. శ్రీలక్ష్మికి.. సావిత్రితో ఎనలేని అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సావిత్రిని ఆమె ఆదర్శంగా తీసుకున్నారట. సావిత్రి తరహాలోనే నటించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలో అనేక సినిమాల్లో మంచి పేరు వచ్చింది. అదేసమయంలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చేవారు.
ఇక, ఆ సమయంలో వచ్చిన ఆఫర్లు.. అన్నీ ఇన్నీ కావని.. శ్రీలక్ష్మి అనేవారు. అయితే.. తాను కేవలం సదరు పరభాషా సినిమాల్లో నటించడమే కాకుండా.. భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని.. ఆ సినిమాల్లో జీవించే ప్రయత్నం చేసినట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఆమె 14 భాషలు నేర్చుకున్నారట.
కశ్మీరీ భాషలో ఒక సినిమాలోఆఫర్ వచ్చింది. నాకు ఆ భాష రాదు. దర్శకుడు చేయించారు. బాగానే ఉది. కానీ, సినిమా ఫెయిల్ అయింది. కారణం.. ఆ భాష నాకు రాకపోవడమేనని తెలిసింది. వెంటనే భాషను నేర్చుకున్నాను. తర్వాత.. మరోసినిమాను అడిగి నేనే నటించాను ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని శ్రీలక్ష్మి వివరించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, కొంకణి, సంస్కృతం.. ఇలా.. 14 భాషల్లో ఆమె నటించారు.