ఓ యువ హీరో.. కోట్ల రూపాయల అధిపతికి కొడుకు.. సినిమా పరిశ్రమలో బాగానే నిలదొక్కుతున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన టాలీవుడ్ యువ హీరో.. హీరో మామూలోడు కాదు.. సౌతిండియాలోనే పేరున్న ఈ యువ హీరోకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి.. కష్టాలు అంటే మామూలు కష్టాలు కాదు.. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి హాండిచ్చింది… తాను తాగుబోతు అయ్యాడు.. ఇది రీల్ జీవితంలో ఏదో సినిమా కథ చెప్పడం లేదు.. నిజ జీవితంలో ఓ యువ హీరో విఫల ప్రేమగాథ.
సిని పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేని ఓ అమ్మాయిని ఈ యువ హీరో పీకల్లోతుగా ప్రేమించాడు. ప్రేమించడం అంటే మామూలుగా కాదు.. ఓ అర్జున్‌రెడ్డిలాగా అన్నమాట. అయితే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల క్రితం గొడవ జరిగిందని ఫిలింనగర్‌లో టాక్. అయితే ఆ అమ్మయి చెప్పా చేయకుండా ఫ్లైట్ ఎక్కేసి అమెరికా చెక్కేసింది. ఇక ఈ యువ హీరో నిత్యం అ అమ్మాయికి ఫోన్ చేయడం.. కానీ అమ్మాయి నాట్ రీచబుల్.. చేసేదేమి లేదు.. అబ్బాయికి ఇదో అలవాటుగా మారింది.. ఫోన్ చేయడం.. నాట్ రీచబుల్ సమాధానం రావడం..
అయితే అమ్మాయి హాండ్ ఇచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్న ఈయువ హీరో.. చేసేదేమి లేక.. అమ్మాయిని మరిచిపోలేక.. అక్కినేని నాగేశ్వర్‌రావు సినిమా దేవదాస్‌లాగా మారిపోయాడు.. మూడు ఫుల్‌లు.. ఆరు హాఫ్ లు.. ఇదే వ్యాపకం.. అమ్మాయిని మరిచిపోలేని ఆ యువ హీరో హద్దులు లేకుండా తాగుతూ తన సినిమా డేట్స్‌ను నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు తల పట్టుకున్నారని ఫిలింనగర్ లోకం కోడై కూస్తుంది. ఈ యువ హీరో వ్యవహారంతో అటు దర్శన నిర్మాతలు నానా గడ్డికరుస్తుంటే.. ఈ యువ హీరో కేరీర్ కొండెక్కేలా ఉందని టాక్. ఈ యువ హీరో మారేదెప్పుడో.. నిర్మాతలు, దర్శకుల ఇబ్బందులు తీరేదెప్పుడో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.