సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ టీజర్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈచిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. 2020 జనవరి 11న చిత్రం విడుదల చేస్తున్నట్లు టీజర్లో ప్రకటించారు. చిత్రదర్శకుడు ఈ టీజర్‌ను ఎంతో చక్కగా కట్ చేశాడు. మేజర్ పాత్రలో కాశ్మీర్లో అదరగొట్టిన మహేష్, శత్రువులు బోర్డర్‌లోనే కాదు.. సమాజంలో మనమధ్యనే ఉంటారు. మన మధ్యలో ఉన్న శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.
టీజర్‌ను 1.26నిమిషాల నిడివితో కట్ చేశారు దర్శకుడు. ఈరోజు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఇప్పటికే మహర్షి సినిమాతో పరుపు పోగొట్టుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి సంగీతాన్ని అందించారు.
ఇక ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు సరసన రౌడీ హీరోయిన్ రష్మీక మందన్న నటిస్తుంది. ఈ టీజర్‌తో చిత్రంపై దర్శకుడు అనిల్ రావిపూడి భారీ హైప్‌ను క్రియోట్ చేశారు. మేజర్ గా మహేష్‌బాబు గెటప్ అదిరిపోయేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక కాశ్మీర్ లొకేషన్లు చూడముచ్చటగా ఉన్నాయి. మొత్తానికి చిత్ర ప్రమోషన్ ఈ టీజర్ తో ప్రారంభించినట్లే అనిపిస్తుంది. ఇక రాబోవు నెలంతా సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్‌తో ప్రిన్స్ అభిమానులకు పండుగే పండుగ.