టాలీవుడ్లో ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు అయిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రెండు ఒకే రోజున థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు పోటీగా ఒకే రోజు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల ప్రమోషన్ల జోరు, క్రేజ్ విషయంలో మహేష్ సినిమా కంటే బన్నీ సినిమాయే ముందు ఉన్నట్టు ట్రేడ్ టాక్ చెపుతోంది.
అల వైకుంఠపురం నుంచి వచ్చిన మూడు పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. మూడు పాటలు ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయి. సామజవరగమన అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటి వరకు మహేష్ సినిమా నుంచి విజయశాంతి లుక్ ఒక్కటి మాత్రమే ఆకట్టుకుంది.
ఇక మహేష్ సినిమా హిందీ డిజిటల్ + శాటిలైట్ రు.15.5 కోట్లు పలికితే ఇప్పుడు అల వైకుంఠపురములో 19.50 కోట్ల కు హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు ఇచ్చేయడానికి ఒప్పందం కుదిరినట్లు బోగట్టా. వాస్తవానికి హారిక హాసిని సంస్థ 22 కోట్లు కావాలని కోరింది. అయితే రు.19.50 కోట్లకు డీల్ ఓకే అయ్యింది. అంటే మహేష్ సినిమాతో పోలిస్తే రు.4 కోట్లు ఎక్కువ.
అదే మహేష్ మహర్షి సినిమాకు రు.20 కోట్లు వస్తే ఇప్పుడు ఐదు కోట్లకు తక్కువగా ఇచ్చేశారు. ఏదేమైనా ఇప్పటికే బయటకు వచ్చిన పాటలు పాపులర్ అవ్వడంతో ట్రేడ్ వర్గాలు సైతం బన్నీ సినిమాకే ఎక్కువ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీని ఫ్రభావం కూడా హిందీ మార్కెట్ లో కాస్త మంచి అమౌంట్ రావడానికి ఉపయోగపడినట్లు బోగట్టా.