దర్శకుడు పరుశరామ్ మాములోడు కాదండోయ్.. చూస్తే అమాయకంగా కనిపిస్తాడు కానీ ఇప్పుడు ఆయన ఆ విషయంలో చాలా స్పీడ్‌గా ఉన్నారు.. ఒకరా ఇద్దరా.. ఏకంగా నలుగురిని లైన్లో పెట్టి పరుశరామ్ తన సత్తాను చాటుకునేందుకు సిద్దంగా ఉన్నాడు. దర్శకుడు పరుశరామ్ ఏకంగా ప్రముఖ నటి అక్కినేని సమంతను లైన్లో పెట్టారు. పరుశరామ్ గట్టోడే అనుకుంటున్నారు సిని పెద్దలు. ఇంతకు సమంతను పరుశరామ్ ఎందులో లైన్లో పెట్టారు అనుకుంటున్నారు. పరుశరామ్ సమంతతో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయబోతున్నారు. అందుకు సమంత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని టాక్.
అయితే సమంత కన్నా ముందే పరశురామ్ అక్కినేని నాగచైతన్యను లైన్లో పెట్టారు. నాగచైతన్య , పరశురామ్ కాంబినేషన్లో సినిమా చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది. అయితే పరశురామ్ ఈ ఒక్క సినిమాతోనే సరిపెట్టడం లేదు. అదే కాంపౌండ్‌లో మరో సినిమాకీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసారి సమంతతో. పరశురామ్ దగ్గర ఓ లేడీ ఓరియెంటెడ్ కథ ఉంది. దాన్ని సమంతతో తెరకెక్కించేందుకు ప్రణాళికలు నడుస్తున్నాయి. చైతూ సినిమా పూర్తయిన వెంటనే, సమంత సినిమాని పట్టాలెక్కించాలని పరశురామ్ భావిస్తున్నాడు.
టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన గీత గోవిందం సినిమా తరవాత పరశురామ్‌కి యేడాది పాటు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అలాంటి విరామాలు రాకుండా ఉండాలన్నది పరశురామ్ ఆలోచన. నిజానికి గీత గోవిందం కథని నాగచైతన్య, సమంతలకే వినిపించాడట పరశురామ్. లైన్‌గా చెబుతున్నప్పుడు ఆ కథ చైతూకి పెద్దగా ఎక్కలేదు. అది కాస్త విజయ్, రష్మికల చేతిలో పడి సూపర్ హిట్ అయ్యింది. అనవసరంగా ఓ సూపర్ హిట్ సినిమాని వదులుకున్నం అన్న ఫీలింగ్ అటు చైతూకీ, ఇటు సమంతకీ ఉంది. అందుకే పరశురామ్ తో ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు. అంతే కాదు పరుశరామ్ ఇప్పటికే ప్రభాస్‌ను కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. సో పరుశరామ్ స్పీడ్ గా ముందుకు సాగేందుకు రెడి అయ్యారు.