స్టార్‌ డైరెక్టర్‌ లవ్‌ ఫెయిల్యూర్‌.. లవ్‌ ప్రపోజల్‌ను తిరస్కరించిన యువ హీరోయిన్‌

ఆయనో స్టార్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం బిజీ యాక్టర్‌. విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆశ్యర్చంలో ముంచెత్తుతున్నారు. ఇంకా ఆయనెవరో గుర్తుకురాలేదా? సరే ఖుషి సినిమాతో తెలుగు సినిమాకు చేరువైన దర్శకుడు ఎస్‌జే సూర్య. ఇటీవలె ఆయన ఓ యువ హిరోయిన్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేయగా ఆమె తిరస్కరించిందట. ఇప్పుడీ వార్త కోలివుడ్‌లో చర్చనీయాశంగా మారింది. దీనిని దర్శకుడు సూర్య ఖండిచడమేగాక, చెత్త రాతలు రాయవద్దని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే.. ఎస్‌జే సూర్య ఖుషితో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నారు. అటు తరువాత చాలా కాలం ఆయన తెలుగు పరిశ్రమకు దూరమైనా స్పైడర్‌ సినిమాతో మళ్లీ దర్శనమిచ్చారు. ఆ సినిమాలో సైకో విలన్‌ పాత్రను పోషించి తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం పొందారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన కోలివుడ్‌లో రాధామోమన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బొమ్మై చిత్రంలో ఒక కీలక పాత్రలో సూర్య నటిస్తున్నాడు. ఆ సినిమాలో హిరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌. వారిద్దరు గతంలో మాన్‌స్టర్‌ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలె బొమ్మై సినిమా చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రియాభవానీ శంకర్‌కు సూర్య లవ్‌ ప్రపోజ్‌ చేశాడట. అది విని సదరు హిరోయిన్‌ షాక్‌కు గురైందట. వెంటనే సూర్య ప్రేమను తిరస్కరించిందట. దీంతో ఈ దర్శకుడు ఒకింత నిరాశకు గురయ్యాడు. ఇప్పుడీ విషయం కోలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై పలువురు సూర్యను ప్రశ్నించగా దీనిని ఖండిచాడట. అదీగాక కొందరు ఇడియట్స్‌ కావాలనే చెత్త రాతలు రాస్తున్నాడని విరుచుకుపడ్డాట. అలాంటి రాతలు రాసి తనను ఇరిటేట్‌ చేయవద్దని కోరాడట. అదీగాక దీనిపై ట్విట్‌లోనూ పోస్టు చేశాడట. ప్రియాభవాని శంకర్‌ తాను మంచి స్నేహితులమని, తమ మధ్య చిచ్చుపెట్టడానికే కొందరు ఇలాంటి రాతలు రాస్తున్నారని సూర్య ట్విట్‌ చేయడం గమనార్హం. కావాలనే కొందరు దీనిని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags: bommi movie, heroin priya bhavani shanker, sj surya