టాలీవుడ్ టైగర్, మహానటుడు నందమూరి తారక రామారావు. ఆ మహానటుడికి అచ్చుగుద్దినట్టుగా ఉన్న నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు అందరు యంగ్ టైగర్ ను ముద్దుగా బుడ్డోడు అంటారు. అయితే ఈ బుడ్డోడు ఓ సినిమాలో వాడిన డైలాగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌లు ఎందుకు వైరల్ అవుతున్నాయి అనుకుంటున్నారా.. వైరల్ అవుతున్న డైలాగ్ ఏంటీది.. ఏ సినిమాలోనిది..
ఇప్పుడు తెలంగాణ అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలపై అట్టుడుకుతుంది. ప్రతి రోజు జరుగుతున్న అత్యాచారాలు, హత్యలతో తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం వరంగల్‌లో ఓ దళిత అమ్మాయి టేకు లక్ష్మీ.. హైదరాబాద్ శివారులో డా. ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య చేయబడ్డారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుమీదకు వచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు. బహిరంగంగా ఉరి తీయాలని, 2008 యాసిడ్ దాడిలో పాల్పడిన వారిని అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసినట్టుగా ఈ నలుగురు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలోని డైలాగ్‌లను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ సమయంలో రాఖీ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చేయని పాపానికి ఆడవాళ్లు శిక్షలు అనుభవిస్తున్నారు..చేసిన పాపానికి శిక్ష వేయడానికి లేటెందుకు… తెల్లారే సరికి ఉరేసే దమ్ముందా అని ఎన్టీఆర్ ప్రశ్నించే డైలాగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా కన్నా వరంగల్ యాసిడ్ దాడి సంఘటన లాగా మృగాళ్ళను అప్పటి కప్పుడే ఎన్‌కౌంటర్ చేస్తే ఇలాంటివి పునరావృతం కావనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు.