సెక్స్ దీని గురించి మాట్లాడాలి అంటే చాలా మంది ఆసక్తి చూపించారు. అదేదో పాపంలా భావిస్తూ ఉంటారు… కాని దాని వలన కలిగే ప్రయోజనాల గురించి మాత్రం ఎవరూ తెలుసుకోలేరు. సెక్స్ వలన కలిగే ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి అంటూ ఉంటారు పరిశోధకులు సైతం… ఆరోగ్యంగా ఉండటానికి సెక్స్ కూడా ఒక కారణమని అంటూ ఉంటారు. తాజాగా సెక్స్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం బయటపడింది. ప్రతీ రోజు సెక్స్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది అంటున్నారు… మానసికంగా ఉపయోగాల నుంచి,
శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చని అంటున్నారు. క్రమంతప్పకుండా సెక్స్‌లో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్, పురుషుల్లో ఆండ్రోపాజ్ వాయిదా పడతాయి. పురుషుల్లో ప్రోస్టేట్ కేన్సర్, ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు, మహిళల్లో యోని సంబంధ ఇబ్బందులు రావని వైద్యులు చెప్తున్నారు. ట్రెడ్మిల్ మీద పరిగెత్తినంత ఫలితం దక్కకపోయినా, సెక్స్‌లో పాల్గొనడం మూలంగా క్యాలరీలు కొంత మొత్తంలోనైనా ఖర్చవుతాయని అంటున్నారు. ప్రతి రోజు సెక్స్ లో పాల్గొనడం వలన కోరికలు సజీవంగా ఉంటాయని సూచిస్తున్నారు…
ఇక ఇద్దరి మధ్య మానసికంగా బంధం బలపడటానికి సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. సెక్స్‌లో పాల్గొనడం మూలంగా మనసును ఆహ్లాదంగా ఉంచే ‘ఫీల్ గుడ్హార్మోన్లు’ విడుదల అవుతాయని అంటున్నారు. స్త్రీపురుషుల్లో ఈస్ర్టోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు సమంగా ఉండాలంటే తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉండాలని సూచిస్తున్నారు. సెక్స్‌లో పాల్గొనడం మూలంగా నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని… ఇక సెక్స్ అనంతరం వచ్చే నిద్ర… మరే సందర్భంలోనూ రాదని అంటున్నారు.