సుడిగాలి చుట్టుముట్టిందేమిటీ.. విజ‌న‌రీ చంద్ర‌బాబు..?

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని వైసీపీ నాయ‌కులు ఎప్ప‌ట‌క‌ప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. సోష‌ల్ మీడియాలో తెగ ఆడుకుంటున్నారు. అందులో మ‌రీ ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ముందుంటారు. త‌న ట్విట‌ర్ ద్వారా చంద్ర‌బాబుపై చాలా సెటైరిక్ కామెంట్ల‌ను పెడుతుంటారు. బిరుదులు కూడా ఇచ్చేస్తుంటారు. వ్యంగ్యాస్ర్తాల‌ను సంధిస్తుంటారు. తాజాగా మ‌రోమారు చంద్ర‌బాబుపై ఆయ‌న సెటైర్లు వేశారు. కొత్త బిరుదును కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దానిని వైసీపీ నేత‌లు ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ బిల్లుల‌ను శాస‌న‌మండ‌లిలో అడ్డుకున్న బాబు అండ్ కో ఏదో సాధించిన‌ట్లు సంబురాలు చేసుకున్నాయి. పూల‌వ‌ర్షాలు కురిపించుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ చ‌ర్య‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌సీఎం జ‌గ‌న్ ఏకంగా శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేసేందుకు పూనుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఉన్న నాలుక‌కు మందేస్తే కొండ‌నాలుక ఊడి పోయిన‌ట్లు ప‌రిస్థితి త‌యారైంద‌ని వాపోతున్నారు. దీనిపై అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి త‌న ట్విట‌ర్‌లో కామెంట్లు పెట్టారు. పూల‌ఖ‌ర్చు వృథా అయిపోయిన‌ట్టేనా? రాజ‌ధాని సంగ‌తి దేవుడెరుగు అస‌లు కౌన్సిల్‌కే ఎస‌రు తెచ్చార‌ని సొంత పార్టీల నేత‌లే పిడ‌క‌లు విసురుతున్నారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి ఇలా చుట్టుముట్టిందేమి విజ‌న‌రీ? అంటూ వ్యంగ్య‌బాణాల‌ను సంధించారు. ఇక విజ‌య‌సాయిరెడ్డి గ‌తంలోనై చంద్ర‌బాబు, స్పీక‌ర్ య‌న‌మ‌ల‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇప్ప‌డీ ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది. సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

Tags: ex cm chandrababu naidu, tdp leaders, ycp mp vijayasai reddy