సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీసు వద్ద కాసులను కురిపిస్తున్నది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్‌బాబు, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి హిట్టును అందుకుంది. విడుదలయిన అన్ని సెంటర్లలో తొలిరోజున భారీకలెక్షన్లను రాబట్టింది. విదేశాల్లోనూ కాసులను కొల్లగొట్టింది. నాన్ బాహుబలి రికార్డులను రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఆ మరునాడే జనవరి 12న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమా విడుదల కావడంతో ప్రిన్స్ జోరు కొద్దిగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదిరోజుల్లోనూ మహేష్ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మొత్తంగా 12 రోజుల్లో సుమారు 120కోట్ల షేర్‌ను గ్రాస్ చేసిందని సినీ దర్శకనిర్మాతలు స్వయంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా సినిమా మరిన్ని కలెక్షన్లను రాబట్టేందుకు గ్రాస్‌ను షేర్ చేసేందుకు వారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. చిత్రంలో అదనంగా రెండు సన్నివేశాలను జోడించనున్నట్లు బాహాటంగానే వెల్లడించారు. అందులో ఒకటి రావు రమేష్, ప్రిన్స్ మధ్య రైలులో సాగిన కామెడీ సీన్లకు కొనసాగింపని తెలిపారు. దానితో మరొక సీన్‌ను ఆడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా చేర్చుతున్న ఆ సన్నివేశాలను వారం చివర నుంచి థియేటర్లలో చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు దీనిపై చర్చంతా సాగుతున్నది అభిమానుల్లో. ఆ సీన్లు మరి సినిమా కలెక్షన్లకు బూస్ట్ నిస్తాయో లేదో? చూడాలి మరి.