వై శ్రీనివాసరెడ్డి.. టాలీవుడ్ లో పేరున్న గొప్ప కమెడియన్. ఇది అందరికి తెలిసిందే.. తన డైలాగ్‌లతో.. కమెడితో ప్రేక్షకులకు నవ్వులు అందిస్తున్న ఈ కమెడియన్‌ను ఇప్పుడు ఓ ప్రముఖ దర్శకుడు పొగిడాడు. అంతేకాదు.. గొప్ప కమెడియన్ అంటూ భవిష్యత్‌లో మంచి దర్శకుడిగా, నిర్మాతగా రాణించాలని శుభాకాంక్షలు తెలిపాడు ఈ దర్శకుడు. ఈ దర్శకుడు పొగడటంతో ఆ కమెడియన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇంతకు శ్రీనివాసరెడ్డిని పొగిడిన ఈ దర్శకుడు ఎవ్వరనుకుంటున్నారు.
కమెడియన్ శ్రీనివాసరెడ్డి అకృతి అశ్రిత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని నిర్మాతగా మారాడు. అంతే కాదు ఓ సినిమాను కూడా దర్శకత్వంతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కాబోతుంది. అయితే శ్రీనివాసరెడ్డి నిర్మాతగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నటుడిగా నటిస్తున్న చిత్రం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనంగా మారింది. ఈ ట్రైలర్‌తో ఆకట్టుకున్న శ్రీనివాసరెడ్డి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళీ శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకధీరుడు రాజమౌళీ తన ట్వీట్టర్ ఖాతాలో శ్రీనివాసరెడ్డిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన కేరీర్ ప్రారంభించినప్పటి నుంచి శ్రీనివాసరెడ్డిని చూస్తున్నాను. అతడు గొప్ప కమెడియన్. ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్లో ఓ మంచి కమెడియన్ శ్రీనివాసరెడ్డి. తాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా చిత్రం నిర్మిస్తున్న సందర్భంగా ఈ సినిమా విజయవంతం కావాలని, దర్శకుడిగా, నిర్మాతగా విజయం అందుకోవాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు రాజమౌళి. దర్శకధీరుడు రాజమౌళీ చేసిన ఈ ట్వీట్‌కు శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కమెడియన్ దర్శకత్వం వహిస్తుండటంతో రాజమౌళీ వంటి అగ్రదర్శకులు శుభాకాంక్షలు తెలుపడం ఇది టాలీవుడ్‌కు శుభసూచకమే అని చెప్పవచ్చు.