టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన కేరీర్లో నటిస్తున్న 19వ చిత్రం లుక్ లీకైంది. చిత్ర యూనిట్ నాగచైతన్య లుక్‌ను లీక్ చేసింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. అయితే ఈసినిమాకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ విడుదల చేయడానికి ప్రత్యేక కారణం కూడా ఉందండోయ్.
అక్కినేన నాగచైతన్య పుట్టిన రోజు నవంబర్ 23. అయితే నాగచైతన్యకు బర్త్‌డే కానుకగా శేఖర్ కమ్ముల ఈ లుక్‌ను విడుదల చేశారు. నాగచైతన్య తన కేరీర్ 19వ చిత్రంలో చేయబోయే క్యారెక్టర్‌కు సంబంధించి పరిచయం చేసే ఓ చిన్నపాటి వీడియోను పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తుంది. అందుమే ముందుగా చిత్ర యూనిట్ ఇలా నాగచైతన్య లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌లో నాగచైతన్య ఎంతో కూల్‌గా, ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
నాగచైతన్య బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతుంది చిత్ర యూనిట్. ఈ వీడియోతో శేఖర్ కమ్ముల తన చిత్రంలో నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతుంది.. అసలు కథ ఏమిటీ.. సాయిపల్లవితో ఉండు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది చూపబోతున్నారు. ఈ వీడియో అక్కినేని అభిమానులకు ఓ పెద్ద కానుకే అని చెప్పవచ్చు. ఏదేమైనా ఇప్పుడు నాగచైతన్య నటించే సినిమాలో రొమాంటిక్ లవ్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
