ఏపీ శాషనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. దీంతో రాష్ర్ట రాజకీయాల్లో రసవత్తర మార్పులు చొటుచేసుకుంటున్నాయి. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడి్డ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారని వివరించారు. ఇక ఇదే విషయమై అసలు శాసనమండలి అవసరమా? అంటూ ఆ పార్టీ ఎమ్మేల్యే అంబటి రాంబాబు కీలక వాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా మండలి రద్దు చేయనున్నారే సంకేతాలను ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం.
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం రద్దు తదితర బిల్లుల ఆమోదంలో ఊహించిన పరిణామాలతో ఆయన షాక్ తిన్నారు. సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో ఆ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా రూల్ 71 పేరిట టీడీపీ అడ్డుకోవడం, అందుకు మద్దతుగా నిబంధనలను ఉల్లంఘించి విచక్షణా అధికారాలను వినియోగించి ఆ బిల్లులను చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీ పంపడంతో వైసీపీ ప్రభుత్వం కంగుతిన్నది. అదే సమయంలో భవిష్యత్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవతుందని, కీలక బిల్లుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తే పాలన సాగడం కష్టమని జగన్ భావించారని సమాచారం. దీంతో అనివార్య పరిస్థితుల్లో మండలి రద్దుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. త్వరలోనే అసెంబ్లీలో ఈ మేరకు తీర్మాణం చేయనున్నారని సమాచారం.