వేశ్యపాత్రలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌

కొత్తదనం కొరుకుంటున్నదో? లేక వయస్సు రీత్యా వచ్చిన మార్పుల ఫలితమో? అందరూ నడిచే దారిలో తానూ నడవాలని నిశ్చయించుకున్నదో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌. విభిన్న కథాంశలను ఎంచుకుంటున్నది. బయోపిక్‌ల వైపు మొగ్గు చూపుతున్నది. ప్రత్యేక పాత్రలతో మెరిసిపోనుంది. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటున్నది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటుగా, తన అభినయంతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చారిత్రక పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ తాజాగా మరోకొత్త బయోపిక్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తున్నది.  ఆ చిత్రంలో వేశ్యగా నటిస్తుందని తెలియడం సంచలనం రేపుతున్నది. ఇప్పుడీ విషయం బాలివుడ్‌ వర్గాల్లోనే కాక, ఐశ్‌ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

19వ శతాబ్దానికి చెందిన బెంగాల్‌ వేశ్య బినోదిని రంగస్థల నటిగా మారి, నాటకాల్లో విభిన్న  పాత్రలను పోషించి ఆపై గాయానిగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆమె జీవితకథ ఆధారంగా బాలివుడ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సర్కార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలో బినోదిని పాత్రను పోషించేందుకు ఐశ్‌ గ్రీన్‌ స్నిగ్నల్‌ ఇచ్చినట్లు బాలివుడ్‌ వర్గాల సమాచారం. త్వరంలోనే దీనిని చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుంది తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఐశ్వర్యరాయ్‌ కన్నా ముందుకు ఆ పాత్ర కోసం దీపికా పదుకొనెను సంప్రదించాడట దర్శకుడు. అయితే అంతటి భారీ పాత్రను తాను పోషించలేనని ఆమె ఆ సినిమాకు నో చెప్పిందని తెలసింది. మరి ఐశ్‌ ఎలా మెప్పిస్తుందో?

Tags: binodhini, Deepika Padukone, ishwaraoy, pradeep sarkar