దర్శకుల కోసం వెతుకులాటలో ఉన్న విక్టరీ వెంకటేశ్ పాత దర్శకుడిని పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్ కు సరిజోడైన దర్శకుడు దొరకక తల పట్టుకుంటే చివరికి ఓ క్రేజ్ డైరెక్టర్ వెంకీని కలిసినట్లు వినికిడి. వెంకటేశ్ ను కలిసిన ఈ దర్శకుడు గతంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించగా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంతకు ఎవ్వరా ఆ దర్శకుడు అనుకుంటున్నారా.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేష్‌బాబు ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. ఈసినిమా చిత్ర సీమలో మల్టీస్టారర్ చిత్రాలకు మరోసారి బీజం వేసింది. అయితే ఈసినిమాను తెరకెక్కించింది దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఎంతో చక్కగా, ఎక్కడ బోరు లేకుండా, పల్లేటూరి వాతావరణంలో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు.
అయితే ఇప్పుడు అదే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేశ్‌ను కలిసి ప్రాజెక్టు చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడని సమాచారం. వెంకటేశ్ ప్రస్తుతం తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో వెంకిమామ సినిమా చేస్తున్నాడు. అ సినిమా పూర్తి కాగానే వెంకటేశ్ అసురన్ రీమేక్ చిత్రంలో నటించబోతున్నారు. అసురన్ చిత్ర రీమేక్ హక్కులను నిర్మాత సురేష్‌బాబు తీసుకున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ నటించబోతున్నారు కానీ సరైన దర్శకుడు దొరకడం లేదు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల వెంకీ ని కలవడంతో ఇదే ప్రాజెక్టు కోసం అనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే ఇదే అసురన్ సినిమాను హను రాఘవపూడి పేరుగా బాగానే వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరికి ఈ ప్రాజెక్టు ఓకే అవుతుందో వేచి చూడాల్సిందే.