వెంకి ‘నారప్ప’ ఫస్ట్‌ లుక్‌ అదిరిందప్పా..

తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అసురన్‌ సినిమాను తెలుగులో రిమేక్‌పై చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోగా విక్టరీ వెంకటేష్‌ ద్విపాత్రాభినయం పోషించనుండగా, హిరోయిన్‌గా మలయాళి భామ ప్రియామణి మెరవనుంది. సురేష్‌ ప్రోడక్షన్స్‌, వీ మీడియా బ్యానర్‌లో కొత్త బంగారు లోకం సినిమా ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత వారమే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. మొదటి షెడ్యూల్‌లో భాగంగా సినిమాలో వెంకటేష్‌కు సంబంధించిన ఏజ్‌డీ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కొంత విరామం తీసుకుని వెంకటేష్‌ యంగ్‌ రోల్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని సినిమా యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంది. అందుకు కారణం పాత్రల రీత్యా వ్యత్యాసాన్ని, సహజత్వాన్ని చూపడానికి కావాల్సిన శారీరక మార్పులను తెచ్చుకోవడానికి వెంకటేష్‌ సమయం తీసుకోనుండడమే.

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు టైటిల్‌ను చిత్రబృందం ఖారారు చేసింది. నారప్పగా ప్రకటించింది. అందుకు సంబంధించిన వెంకటేష్‌ ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేసింది. అందులో వెంకటేష్‌ ఓల్డ్‌ ఏజ్‌లో.. రౌద్రాన్ని ప్రదర్శిస్తు ఉండడం టాలివుడ్‌ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తున్నది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా, తెలుగు సినీ అభిమానులను ఆకర్షించేలా సినిమాకు మాస్‌ టైటిల్‌ను పెట్టడమేగాక, అదే తరహాలో పోస్టర్‌ను రూపొందించడం ఆకట్టుకుంటున్నది. ఇప్పుడీ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఇదే ఏడాది విడుదల కానుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Tags: narapp movie, Srikanth Addala, Thaman, vctory venkatesh