నటీనటులు : విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, యోగిబాబు, ఛాయా సింగ్ తదితరులు.
దర్శకత్వం : సుందర్ సి
నిర్మాతలు : శ్రీనివాస్ ఆడెపు
సంగీతం : హిప్హాప్ తమీజా
విడుదల తేదీ : నవంబర్ 15, 2019
యాక్షన్ హీరో విశాల్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగులోనూ నేడు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
ఆర్మీ కల్నల్ మరియు సీఎం కుమారుడు హీరో విశాల్ (సుభాష్ ). తన బంధువుల అమ్మాయి అయిన మీరా (ఐశ్వర్య లక్ష్మీ) విశాల్ ని ప్రేమిస్తుంటుంది. విశాల్ సైతం ఐశ్వర్యలక్ష్మీతో ప్రేమలో పడతాడు. విశాల్ తండ్రి నిర్వహించిన పార్టీ సమావేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగి కాబోయే ప్రధానమంత్రి మృత్యు వాతపడుతాడు. ఆ బ్లాస్ట్ కి విశాల్ కుటుంబానికి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తాయి. దీంతో మనస్థాపం చెందిన విశాల్ అన్న కాబోయే సీఎం (రాంకీ) అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటాడు. అదే క్రమంలో విశాల్ ప్రేమించి మీరా కూడా హత్యకు గురికాబడుతుంది. తన ప్రేయసీ, సోదరుల మృతికి కారకులు ఎవ్వరు..? వారిని ఎలా పట్టుకున్నాడు..? వారికి ఎలాంటి శిక్షలు విధించారు…? విశాల ఎవ్వరి సాయంతో ఏమీ చేశాడు అనేది సినిమాలో తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
విశాల్ సినిమాలు అంటేనే యాక్షన్‌కు పెద్ద పీట వేస్తాయి. అయితే ఈసినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ తరహాలో ఉన్నాయి. సినిమా ఆసాంతం యాక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ
సినిమాలో విశాల్ నటనతో ప్రేక్షకులను మైమరిచేలా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో విశాల్ నటన అత్యద్భుతంగా ఉంది. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో చిత్రం కన్నా యాక్షన్ చిత్రం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంది. ఇక తమన్నా నటన సినిమాకు ప్లస్ పాయింటే అయింది. తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో ప్రేమ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు వేటికి అవే ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
యాక్షన్ సినిమాలో కథాకథనాలు కొంత బోర్ కొట్టిస్తాయి. సినిమా కొంత సాగదీత కనిపిస్తుంది. స్టోరీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పాటలు కూడా వినడానికి అనుకున్నంత బాగా లేవని చెప్పవచ్చు. ఈ సినిమా యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడేవారి కోసం తెరకెక్కించిన సినిమాగా ఉంది తప్ప మాస్ ప్రేక్షకులను కట్టిపేడేసేలా ఏమీ లేదు.
సాంకేతిక విభాగం :
యాక్షన్ సినిమా సాంకేతిక విభాగం పనితీరును చూస్తే సినిమాటోగ్రఫీ తీరు చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చిత్రీకరించారు. ఎంచుకున్న లోకేషన్లు, సినిమాటోగ్రఫీ పనితీరుతో సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సంగీత దర్శకుడు తమీజా సమకూర్చిన బాణీలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
తీర్పు :
ఇక దర్శకుడు ఎక్కడా యాక్షన్ ట్రీట్ తగ్గకుండా.. భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు కొన్ని ఛేజింగ్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నుంచి కావాల్సినంత యాక్షన్ ను రాబట్టుకుని హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను నిలపడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. సినిమా మొత్తానికి విశాల్ యాక్షన్‌కు సరిపడా ఉంది.
రేటింగ్ : 3/5