మాస్ హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నాడు విశాల్. విశాల్, తమన్నా జంటగా, సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. యాక్షన్ శుక్రవారం విడదల అయింది. ఈ సినిమాతో తన నటనా సామార్ధ్యాన్ని చాటిచెప్పాడు విశాల్. అయితే ఇదే రోజు విశాల్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
హీరోగా విశాల్, రెజీనా హీరోయిన్లుగా, ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు చక్ర అనే టైటిల్ ఖరారు చేశారు.ఈ సినిమాను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాధ్, సృష్టి డాంగే కీలక పాత్రధారులు పోషిస్తుండగా, మనోబాల, రోబో శంకర్ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా పై విశాల్ అభిమానులు భారీ అంచనాలే పెంచుకున్నారు.
చక్ర సినిమా పోస్టర్‌లో ఉగ్ర నరసింహావతారంలో రౌడీలను చితకబాదుతున్నాడు విశాల్. టైటిల్ లోగో అండ్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీరెరకెక్కుతున్న చక్ర సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఒక సినిమా విడుదల అయిన రోజునే మరో సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేసి విశాల్ తన అభిమానులకు పండుగ వాతావరణం తెప్పించాడనే చెప్పవచ్చు.