విడుద‌ల కానీ విజ‌య్ సేతుప‌తి..!

హీరో క‌మ్ విల‌న్ గా న‌టంచే టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి. ఆయ‌న  నటించిన తమిళ చిత్రం సంఘ తమిజాన్. ఈ సినిమాను తెలుగులో విజయ్ సేతుపతి పేరుతో హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో  విజయ్ రెండు భిన్న పాత్రలలో నటిస్తుండగా ఈ మూవీని నేడు విడుదల కావాల్సి ఉండ‌గా చివ‌రి నిమిషంలో వాయిదా ప‌డింది.  

విజయ్ సేతుపతి చిత్రం నేడు విడుదల కాలేదు.  విడుదల చివరి నిమిషంలో తలెత్తిన ఫైనాన్సియల్ ఇబ్బందుల కారణంగా ఈ మూవీ రెండు భాషలలో విడుదల వాయిదాపడింది. దీనితో విజయ్ సేతుపతి అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.. విజయ్ సేతుపతి చిత్రాన్ని విజయ్ చందర్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాశిఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.

విజ‌య్ సేతుప‌తి హీరోగా రాణిస్తూనే, తెలుగులో అనేక సినిమాల్లో విల‌న్ పాత్రాలు పోషిస్తున్నారు. స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర‌చంద‌నం నేప‌థ్యంతో తెర‌కెక్కె చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా ఎంపికైన‌ట్లు ఓవైపు ప్ర‌చారం జ‌రుగుతుంది. విజ‌య్ సేతుప‌తికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఈసినిమా విడుద‌ల ఆగిపోవ‌డంతో అభిమానుల ఆశ‌లపై నీళ్ళు చ‌ల్లిన‌ట్లైంది.

Tags: Dubbing Movie, Release Postpone, Tollywood, VijaySethupathi