ఎర్రని లంగావోణి… ఓర చూపులతో… కొంటే కుర్రకారును హుషారెత్తిస్తుంది ఈ టాలీవుడ్ అందాల భామ. మిడ్డిలు అని చెడ్డీలు వేసుకుని తిరుగున్న ఈ రోజుల్లో ఆనాటి లంగావోణిలు అందమైన అమ్మాయిలు ధరిస్తే ఎలా ఉంటారో ఈ లుక్కు చూస్తే తెలిసిపోతుంది. లంగావోణికి పెటెంట్ తీసుకున్నట్లు గా మెరిసిపోతుంది ఈ అమ్మడు. ఇప్పుడు లంగావోణిలో తళక్కున మెరిసిపోతున్న ఈ అమ్మడు ఎవ్వరో తెలుసుకోవాని ఉందా.. అయితే మీరే చూడండి.
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకున్న అందాల సుందరి రష్మీక మందన్నా. ఇప్పుడు రష్మీక మందన్నా నటిస్తున్న చిత్రం సరిలేరునీకెవ్వరు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటిస్తున్న ఈ సుందరి లంగావోణితో సెట్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సరిలేరు నీకెవ్వరు సెట్స్‌లో లంగావోణిలో ఉన్న రష్మీక ఫోటో హల్చల్ చేస్తోంది.
లంగావోణిలో ఉన్న రష్మిక ఫోన్ ఆపరేట్ చేయడంలో మునిగిపోయి బిజీగా ఉంది. మరొక ఫోటోలో కొంటెగా చూస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా చూస్తోంది. మొత్తానికి లంగావోణిలో ఉన్న రష్మికను చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా రష్మికకు సరిలేరు ఎవ్వరూ అంటూ ట్వీట్ చేస్తున్నారు.మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది రష్మిక. ఓ వైపు మహేష్ బాబు సినిమాలో నటిస్తూనే మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాష్టారు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా ఓకే అయింది.