చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా మారింది రాష్ర్టంలోని ప్రధాన పార్టీల పరిస్థితి. ఎవరికి వారు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ పరస్పరం ఇరకాటంలో పడేసుకుంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ప్రజలకు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పడేం జరుగుతుంది? ఏ పార్టీ ఏం చేస్తుంది? అన్న ఆసక్తితో ప్రజలు ఉత్కంఠతతో
ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ అసెంబ్లీలో ఆమోందించిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసన మండలిలో టీడీపీ అడ్డుకున్నది. ఆ పార్టీ అధినేత వేసిన రూల్ 71 పాచిక పారడంతో ఆ బిల్లులు మండలికి చేరకముందే సెలక్ట్ కమిటీ చేతికి చేరాయి. దీంతో వైసీపీపై టీడీపీ విజయం సాధించింది. దీంతో వైసీపీ ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా పావులు కదుపుతూ విపక్ష టీడీపీ భారీ షాక్‌ను ఇచ్చింది. దానిని తిప్పికొట్టేందుకు చంద్రబాబు సెంటిమెంట్‌ను వాడుకునేందుకు అప్పుడే యత్నాలు మొదలుపెట్టారు. నాడు తండ్రి వైఎస్ పునరుద్ధరించిన మండలిని నేడు తనయుడు జగన్ రద్దు చేస్తున్నారని, తద్దారా ఆయన ఆశయాలకు గండి కొడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టేందుకు జగన్ సైతం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. 1986లో మండలిని ఎన్టీఆర్ సైతం రద్దు చేశారని ఉటంకిస్తున్నారు. అదీగాక నాడు వైఎస్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరిస్తుంటే వ్యతిరేకించారని, రద్దు చేయాలని బాబు కోరారని గుర్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను, 58 పేజీల చిట్టాను వైసీపీ వెలికి తీస్తున్నది. దీంతో ఏపీలో రాజకీయా వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎక్కడ చూసినా ఏం జరుగుతుందా? అనే చర్చలు సాగుతున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అటు బీజేపీని కూడా ఇరకాటంలో పడేయయనుంది. ఎందుకంటే శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఆ పార్టీకి సంకట పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రవేశపెట్టిన బిల్లులను ఆ పార్టీ రాష్ర్ట నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీపై పోరాడేందుకు, రాజధాని రైతులకు అండగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్‌తో కలిసి కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి సమయంలో శాసనమండలి రద్దు బిల్లును అమోదిస్తే పరిస్థతి అడ్డం తిరుగుతుంది. జగన్‌కు పరోక్షంగా సహరించినట్లుగానే మారుతుంది. అదీగాక బీజీపీ, ఇటు వైసీపీ రెండు ఒకటేనని టీడీపీ ప్రచారం చేసే అవకాశముంది. దీంతో ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠత నెలకొంది.