సాధారణంగా తెలుగు చిత్రసీమలో బాలయ్య సినిమాలతో పోలిస్తే మిగతా హీరోల సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ అంత హైలైట్ కావు. ఏదో స్టోరీకి తగ్గట్టుగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి తప్ప…బాలయ్య సినిమాలు మాదిరిగా ఉండవు. కానీ బాలయ్య సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు పూనకాలు వచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా రోమాలు నిక్కబొడిచేలా బాలయ్య ఫైట్స్ ఉంటాయి.
ఎక్కువ శాతం బాలయ్య సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్సే బాగా హైలైట్ అవుతాయి. అవే సినిమాని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఈ ఏడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ వల్ల అభిమానులు అలాంటి ఎపిసోడ్స్ చూడలేకపోయారు. కానీ తాజాగా వస్తున్న రూలర్ చిత్రంలో వీటికి అసలు కొదవే లేదట. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో 5 అదిరిపోయే ఫైట్స్ ఉన్నాయట. ఇవి చిత్రానికే హైలైట్ కానున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వస్తుంది. బాలయ్య- కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జైసింహా’లో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవి సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి మించి ఇందులో యాక్షన్ సీన్స్ పెట్టారట. ఈ చిత్రంలో నాలుగు ఫైట్స్ మాత్రం సూపర్ ఉంటాయట.
ఇంట్రవెల్ ముందొచ్చే పోరాట సన్నివేశం చిత్రానికే హైలైట్ కానుందట. అలాగే బీహార్ నేపథ్యంలో డిజైన్ చేసిన ఫైట్, మార్కెట్ నేపథ్యంలో మరో ఫైట్, ట్రైన్లో ఇంకో భారీ ఫైట్ అభిమానులని అలరిస్తాయట. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా జై సింహా మాదిరిగా ఇందులో కూడా మంచి మంచి సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అలాగే బాలయ్య డ్యాన్సులు అదరగొట్టనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి బాలయ్య రూలర్ ఏ రేంజ్ లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తారో?